దాదాపు 40 కి పైగా తెలుగు సినిమాల్లో నటించిన సీనియర్ నటి లయ మళ్లీ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. నితిన్ హీరోగా చేస్తున్న తమ్ముడు మూవీలో నితిన్ కి అక్క పాత్రలో లయ నటిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే చాలా రోజుల నుండి టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది.ఇందులో భాగంగా ఆ హీరో నన్ను తన సినిమా నుండి తీసేయమన్నారు అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. మరి లయను సినిమా నుండి తీసేయమని చెప్పిన ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.లయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బాలకృష్ణ గారితో విజయేంద్ర వర్మ సినిమాలో ఆయన భార్య పాత్రలో నటించాను. 

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశం చేసేటప్పుడు పొరపాటున ఆయన కాలు తొక్కాను. వెంటనే బాలకృష్ణ గారు నా మీద అరుస్తూ ఏంటమ్మా నా కాలే తొక్కుతావా..వెంటనే ఈ అమ్మాయిని ఈ సినిమా నుండి తీసేయండి అంటూ గట్టిగా చెప్పారు. దాంతో ఆయన మాటలకు నేను భయపడి పోయి ఓ మూలన కూర్చొని ఏడుస్తున్నాను. ఇక నా ఏడుపు చూసినా బాలకృష్ణ గారు నా దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఊరికే అలా సరదాగా అంటే ఏడుస్తున్నావా..నేను ఆ మాటలు సరదాగా అన్నానులే.నా మాటల్ని పట్టించుకోకు. అయినా ఇలా కాలు తొక్కించుకోవడం నాకు అలవాటే.ఎన్నో సినిమాల్లో ఇలా సినిమా షూటింగ్ లో ఇలాంటి అనుభవం ఎదురయింది అంటూ చెప్పారు.

 అయితే మొదట బాలకృష్ణ గారు కోపంతో అన్న మాటలకు నేను చాలా హర్ట్ అయిపోయి ఏడ్చాను. కానీ ఆ తర్వాత బాలకృష్ణ గారు సరదాగా అన్నానని చెప్పడంతో మళ్లీ మామూలు మనిషిని అయ్యా. ఇక బాలకృష్ణ గారి సినిమాలో నటించడం చాలా మంచి మెమొరీ గా మిగిలిపోయింది.ఆయనతో సినిమాలో నటించిన సమయంలో ఎన్నో మంచి మంచి అనుభూతులు ఉన్నాయి. ఆ షూటింగ్ రోజులు చాలా జాలీగా గడిచిపోయాయి అంటూ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ సినిమాలో నటించిన సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను పంచుకుంది సీనియర్ నటి లయ.

మరింత సమాచారం తెలుసుకోండి: