మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాని భారీ బడ్జెట్లోనే తెరకెక్కించారు.. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితర నటీనటులు నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో కన్నప్ప సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమాకి సంబంధించి అన్ని విషయాలను తెలుపుతున్నారు. అలాగే ట్రైలర్ కూడా విడుదల చేయగా బాగానే రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో  బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని.. బ్రాహ్మణ చైతన్య వేదికగా గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు.



అలాంటి సన్నివేశాలను తొలగించాలని చిత్ర బృందం కూడా డిమాండ్ చేయడంతో పాటుగా సెన్సార్ బోర్డు కు కూడా ఫిర్యాదు చేశారట. అయితే తాజాగా ఈ సినిమా విడుదల నేపథ్యంలో కన్నప్ప సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు కూడా వచ్చింది.. ఈ సినిమాని వీక్షించిన 11మంది సభ్యుల కమిటీతో చర్చించి మరి ఇందులో 13 సీన్లను అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తొలగించారట. ఈ మేరకు వాటిని తొలగించి మళ్లీ రివ్యూ ఇవ్వాలంటు సూచించారట. కన్నప్ప చిత్రంలో కమిటీ సూచించిన 13 సన్నివేశాలను తొలగించిన తరువాతే రిలీజ్ అనుమతి ఇస్తామంటు సెన్సార్ బోర్డు వెల్లడించారు.ఇది మంచు విష్ణుకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు..




దీంతో బ్రాహ్మణ చైతన్య సంగం కన్నప్ప సినిమాపై విజయం సాధించిందని అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ సెన్సార్ బోర్డు కు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి బ్రాహ్మణ చైతన్య వేదిక చేసినటువంటి ఈ పోరాటం కన్నప్ప చిత్రానికి మేలు చేస్తుందా లేదా అన్నది చూడాలి మరి. ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదల కాబోతోంది. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేశారు. మరి ఏ మేరకు మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో కన్నప్ప సినిమా చూడాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: