గత కొన్ని రోజుల నుంచి చెన్నైలో కురుస్తున్న కుండపోతుల వర్షాలు కారణంగా అక్కడ వరదలు సృష్టిస్తున్న బీభత్సం అంత ఇంత కాదు. ఏకంగా జనజీవనాన్ని మొత్తం అతలకుతులం చేస్తుంది  అని చెప్పాలి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వం ఎంతలా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ.. ఇక వరదల ప్రభావం నుంచి అటు జనాలు మాత్రం బయటపడలేకపోతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం లోనే అందరూ అనుక్షణం భయం భయంతోనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.


 అయితే చెన్నైలో వరదలు ఎంతలా పరిస్థితులను అతలాకుతలం చేస్తున్నాయ్ అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఈ వీడియోలను చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అయితే చెన్నైలో పరిస్థితులు త్వరగా సద్దుమణిగి మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నారు. జనావాసాల్లోని రోడ్లు ఇల్లు మొత్తం పూర్తిగా వరద నీటితో నిండిపోవడం.. కరెంట్ కట్ కావడంతో అక్కడి ప్రజలందరూ కూడా అంధకారంలోనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కొంతమంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతూ ఉన్న విషాదకర ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా చెన్నైలో వరదల బీభత్సానికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇక ఇలాంటి వీడియోనే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కంటపడింది. అయితే భారత్ నూ అమితంగా ప్రేమించే డేవిడ్ వార్నర్ ఇక చెన్నైలో నెలకొన్న పరిస్థితులు చూసి చలించిపోయాడు. ఈ క్రమంలోనే తన కంటపడిన చెన్నై వరద బీభత్సం తాలూకు వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఆ నగరంలో అందరూ సురక్షితంగా ఉండాలని.. వీలైతే ఎత్తుగా ఉండే ప్రాంతాలకు తరలి వెళ్లాలి అంటూ సూచించాడు. సాయం చేసే స్థితిలో ఉన్నవారు వారికి అండగా నిలవాలి అంటూ కోరాడు. ఈ క్రమంలోనే వార్నర్ పెట్టిన పోస్ట్ అందరిని ఫిదా చేస్తుంది. ఈ క్రమంలోనే నేటిజన్స్ అందరూ కూడా అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: