గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వాహనాల సేల్స్ భారీగా పెరిగిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆటో మొబైల్ వాహనాలు ఈ ఏడాదిలో భారీగా సేల్ అయ్యాయని అంటున్నారు. మరి ఏడాదిలో మాత్రం అంతకు మించి అనేలా సేల్స్ ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.ఆరో నెలలోనూ ప్యాసింజర్ వాహనాల సేల్స్ స్థిరంగా పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం నేపథ్యంలో వ్యక్తిగత మొబిలిటీ వసతుల కోసం ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020తో పోలిస్తే, ఈ ఏడాది జనవరిలో వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగాయి. 


2020 జనవరిలో 2,62,714 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది 3.03 లక్షల వాహనాలు దేశవ్యాప్తంగా సేల్స్ జరిగాయి.అతిపెద్ద ప్రయాణికుల సంస్థ మారుతి సుజుకి మాత్రం 2020 వ పోలిస్తే స్వల్పంగా 0.6 శాతం తగ్గింది. 2020లో 1,39,844 కార్లను విక్రయించగా, ఈ ఏడాది 1,39,002 మాత్రమే అమ్ముడయ్యాయి. మినీ కార్లు ఆల్టో, ఎస్‌-ప్రెస్సో మోడల్ కార్ల విక్రయాలు 2.8 శాతం తగ్గి 25,153 యూనిట్లకు పడిపోయాయి. కంపాక్ట్ మోడల్ కార్లు వ్యాగనార్‌, స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌, టూర్ ఎస్ కార్ల విక్రయాలు 8.8 శాతం తగ్గి 76,935 యూనిట్లకు తగ్గినట్లు కనబడుతోంది.


మారుతి ప్రత్యర్థి హ్యుండాయ్ కార్ల విక్రయాలు 24 శాతం వ్రుద్ధి చెంది 52,005 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇండియన్ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ కార్ల విక్రయాలు దాదాపు రెట్టింపై 26,978కి చేరాయి. హోండా కార్స్ ఇండియా హోల్‌సేల్ కార్ల విక్రయాల్లో ఎకాఎకీనా 114 శాతం పురోగతి నమోదు చేసుకున్నాయి.ఇకపోతే కరోనా వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగినట్లు నిపుణులు అంటున్నారు.మరో దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సైతం నాలుగు శాతం ప్రగతిని నమోదు చేసింది. గత నెలలో 20,634 కార్లను అమ్మి టాప్ రేంజ్ లో కూర్చుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: