
ఆ కమిటీలో కూడా రాజకీయ ప్రతినిధులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సైన్యం అభిప్రాయాలకు పరిగణనలోకి తీసుకునే వారు కాదు. ఒకరిద్దరు రక్షణ శాఖ అధికారులను కమిటీలో నియమించేవారు. కానీ రాజకీయ నాయకుల అభిప్రాయాలే ఫైనల్. బోఫోర్స్ విషయంలో కూడా ఇలాంటివే జరిగాయి. యూపీఏ ప్రభుత్వం దిగిపోయి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు కొలువు తీరిన తర్వాత కొత్త నిబంధలన్నీ తీసుకు వచ్చారు.
ఒక ప్రోక్రూర్ మెంట్ కమిటీ ని ఏర్పాటు చేశారు. అందులో అందరూ సైనిక అధికారులు ఉండేలా చూశారు. కేవలం భద్రత తదితర విషయాలు పర్యవేక్షించడానికి రక్షణ శాఖ మంత్రి, డబ్బులు ఇవ్వడానికి ఆర్థిక మంత్రిని అందులో సభ్యులుగా చేర్చారు. ఇందులో ఎవరికీ ఏం కావాలో వాళ్లే నిర్ణయించుకోవచ్చు. రాఫెలే కావాలని ఎయిర్ ఫోర్స్ కోరింది. అందుకు అనుగుణంగా ఆయుద్ధ విమానాలనే కొనుగోలు చేశారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అంతేకానీ ముందుగానే రక్షణ రంగం పేరిట ఒప్పందాలు చేసుకోలేదు.
భారత నావీ సిబ్బంది గతంలో బహుబలి విమానం అయిన సీ-295 అడిగారు. ఇది దాదాపు 5-10 టన్నుల సామర్థ్యం బరువు మోసుకెళ్లగలదు. 71మంది సైనికులు లేదా 50మంది పారాట్రూపర్లను వ్యూహాత్మక ప్రాంతాలకు తరలించగలదు. అలాగే ఇప్పుడు హాక్స్ హెలికాఫ్టర్ కావాలని అడిగారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు రకాలైన యుద్ధ విమానాలను దేశ సరిహద్దుల్లో మోహరించేందుకు రక్షణ శాఖ సిద్ధమైంది. వీటికి కేంద్రం అనుమతి ఇచ్చింది.