కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కోడుకు రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అంతేకాదు.. పూజ హెగ్డే ఓ సన్నివేశంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాను చిత్ర యూనిట్ మేలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. తాజాగా మెగా అభిమానులకు మరో అదిరిపోయే సర్ప్రైజ్ వచ్చింది.

తాజాగా ఆచార్య సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. తండ్రి కొడుకులు అయిన చిరంజీవి - రామ్‌ చరణ్ సంయుక్తంగా నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం కీలక పాత్రలో నటిసున్నారు. ఈ సినిమాలో ఎవరి రోల్స్ ఎలా ఉంటాయా ? అన్న ఆసక్తి అయితే అందరిలో నెలకొంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన చిరంజీవి లుక్ అభిమానులను పిచ్చగా నచ్చేసింది. అంతేకాదు.. ఈ సినిమా నుండి వచ్చిన లిరికల్ సాంగ్ కూడా మంచి వ్యూస్ తెచ్చుకుంది.



ఇక ఇప్పుడు ధర్మస్థలికి ద్వారం తెరుచుకుంది. అయితే చివరి షెడ్యూల్లో ఉన్నామంటూ చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇక త్వరలో మరో సర్‌ఫ్రైజ్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటన చేశారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఏడాది కాలం పాటు ఆచార్య షూటింగ్ నిలిచిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ఇక త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు. ఈ సినిమాని కొణిదెల కంపెనీ - మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: