ది ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్ : వింటేజ్ నాగ్ ఈజ్ బ్యాక్?

ది ఘోస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. హీరో కింగ్ నాగార్జున తన ఇంటెన్స్ రోల్ లో స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టాడు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పినట్లుగా వింటేజ్ నాగ్ ని గుర్తు చేసాడు. నాగ్ సబార్డినేట్ గా హీరోయిన్ సోనాల్ చౌహాన్ గ్లామర్ ట్రీట్ అందించింది. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్,  జయప్రకాష్, రవి వర్మ ఇతర పాత్రల్లో కనిపించారు.డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్రాండ్ విజువల్స్ ఇంకా బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పటికీ థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా అన్ని కమర్షియల్ హంగుల మేళవింపుతో ఉంది. చివర్లో నాగార్జున కత్తితో రౌడీ గొంతు కోసే షాట్ హై ఇంటెన్స్ గా ఉంది. ప్రవీణ్ సత్తారు స్టైలిష్ మేకింగ్ ఇంకా యాక్షన్ థ్రిల్లర్ లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.


హై ఇంటెన్స్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన 'ది ఘోస్ట్' రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇది యాక్షన్ ప్రేమికులకు ఫుల్ మీల్ ఫీస్ట్ కానుందని అర్థమవుతుంది.మార్క్ కె రాబిన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయగా  భరత్, సౌరబ్ పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.దినేష్ సుబ్బరాయన్, కేచా మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఇంకా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.'ది ఘోస్ట్' చిత్రాన్ని అక్టోబర్ 5న తెలుగుతో పాటుగా హిందీ ఇంకా తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: