
ఆయనను ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్న తరహాలో కనిపించాడు అందరికీ. కెనడా ప్రధాని తాను, తన సిబ్బంది అందరూ ఈ ఫెసిలిటీస్ ని తీసుకోవడానికి నిరాకరించాడు. అంతే కాకుండా చాలా నార్మల్ హోటల్ అయినటువంటి లలిత్ హోటల్లో ఆయన తన సిబ్బందితో ఉండిపోయాడు. తన స్టాఫ్ అందరికీ కూడా నార్మల్ రూమ్స్ బుక్ చేయించాడు. భారతదేశ గౌరవ మర్యాదలను స్వీకరించడానికి ఆయన నిరాకరించాడు.
అంతే కాకుండా తన విమానానికి ట్రబుల్ వస్తే, భారత్ విమానంలో ఎక్కి రావడానికి నిరాకరించాడు, తట పటాయించాడు ఆయన. ఆయన అనీజీని గమనించి చిరునవ్వుతో పలకరించినా కూడా ఆయన బెదురుగా, బెరుగ్గా నే కనిపించాడు. ఎవరో ఆయనని తరుముతున్నట్టు, ఎవరో ఆయనని కంట్రోల్ లో పెడుతున్నట్లు ప్రవర్తించాడు ఆయన. అక్కడ ఉన్న ఖలిస్తానీ లాభీ నుండి ఫండ్ తీసుకుని దానివల్ల ఆయన అలా ప్రవర్తిస్తున్నాడా, ఖలిస్తానీ వాదులకు భారత్ అంటే గిట్టదు.
వారు భారత్ కు అనుకూలంగా ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి ఒకవేళ ఈయన వాళ్ళ దగ్గర కానీ ఏదైనా ఫండ్ తీసుకుంటే కనుక భయపడడంలో అతిశయోక్తి లేదు. లేదంటే భవిష్యత్తు రాజకీయాలు గురించి ఆలోచించి అయినా ఆయన భయపడి ఉండాలి. లేదంటే ఖలిస్తానీ వాదులకు సపోర్టుగా ఉంటాడు కాబట్టి ఆయన కూడా భారత్ అంటే ద్వేషంగా ప్రవర్తిస్తున్నాడా అనేది అర్థం అవ్వడం లేదు.