తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎన్నో సమూల ప్రక్షాళన చర్యలను పార్టీ అధినేత కెసిఆర్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ అనేక మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో తమకు తిరిగే లేదు అన్నట్లుగా వ్యవహారం నడిచినా, బిజెపి బలం పుంజుకోవడంతో పాటు, అధికారం సంపాదించే అంతటి స్థాయిలో బలం పుంజుకోవడంతో ఇప్పుడు సమూలంగా ప్రక్షాళన చేపట్టకపోతే,  ముందు ముందు రాజకీయ పరిస్థితులు చిక్కుల్లో పడతాయి  అనే ఆందోళనలో కెసిఆర్  ఉన్నారు. అందుకే అన్ని వ్యవహారాలను ఆయన చక్కబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వయసు రీత్యా చూసుకున్నా కేసీఆర్ గతంలో మాదిరిగా ఎక్కువ యాక్టివ్ గా ఉండలేకపోతున్నారు. 





పార్టీని, ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసి ముందుకు నడిపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు  అవకాశం కల్పించి  తన బాధ్యతను నెరవేర్చుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు కేటీఆర్ సైతం సిద్ధంగానే ఉన్నారు.ఇదిలా ఉంటే కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించబోతున్న తరుణంలో కేసీఆర్ కుమార్తె కవిత కు ఏ పదవి ఇవ్వబోతున్నారు అనే చర్చ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మొదలైంది. అసలు ఎప్పటి నుంచో పార్టీలో ఈ ఆసక్తి నెలకొంది. ఆమెకు ఎప్పుడో మంత్రి పదవి వరిస్తుంది అనే ప్రచారం జరిగినా, అందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ లేదు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత మంత్రి పదవిని చేపట్టి పొలిటికల్ గా మరింత యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు.




 త్వరలోనే సీఎం పీఠం పై కేటీఆర్ కూర్చోగానే మంత్రిమండలి ప్రక్షాళన ఉంటుందని, పూర్తిగా తనకు అనుకూలమైన వారిని మంత్రిమండలిలోకి తీసుకుంటారని, దీనిలో భాగంగానే కవితకు మున్సిపల్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించబోతున్నట్లు ఇప్పుడు టిఆర్ఎస్ లో చర్చ మొదలైంది. ఏది ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి గా కేటీఆర్ , మంత్రిగా కవిత తన రాజకీయ వారసత్వం ముందుకు తీసుకెళ్లబోతుండడం కేసీఆర్ కు ఆనందాన్ని కలిగిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: