నల్గొండ జిల్లా పేరు చెబితేనే  అందరికీ గుర్తుకు వచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్.. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం వారు శాసిస్తారు.. ఓటమనేది వారి దరిచేరకుండా చూసుకుంటారు. అలాంటి కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పిల్లర్స్ గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏ పని చేసినా ఏఐసిసి యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే ఈ బ్రదర్స్ ఎప్పుడూ భయపడకుండా  మాట్లాడుతూ ఉంటారు. వాళ్లు కాంగ్రెస్ లో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉంటారు. అలా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం తెలంగాణ మంత్రి వర్గంలో ఉన్నారు. అలాగే ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కోసం ఎదురు చూశారు. కానీ చివరి సమయంలో ఆయనకు మంత్రి పదవి రాలేదు. 

దీంతో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. కాంగ్రెస్ పాలన అస్సలు బాగాలేదని బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేదని అంటున్నారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇంకా స్పందించలేదు.  ఈ ఇష్యూ పై ఏఐసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఆయనకు అధిష్టానం  మంత్రి పదవి ఇస్తానని చెప్పింది నిజమే.. ఏ నిర్ణయం అయినా వాళ్లే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా పార్టీలో ఉంటూనే పార్టీపై విమర్శలు చేసినా, లోకల్ నాయకులు మాత్రం ఆయనను ఏమనలేకపోతున్నారు. ఇలా నడుస్తున్న సమయంలోనే తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో టీచర్స్ డే సందర్భంగా  ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.

 అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉంటే టీచర్స్ అంతా మధ్యలోనే లేచి భోజనానికి వెళ్లారు. దీంతో అసహనానికి గురైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీచర్స్ అంటే క్రమశిక్షణ ఇదేనా..ఇలా మధ్యలో వెళ్లిపోవడమేనా అంటూ మాట్లాడారు.  మీకోసం నేను వచ్చాను. మీరు ఇలా మీటింగ్ మధ్యలో భోజనానికి పరుగులు తీస్తే  ఎలా..కలెక్టర్ చెప్పారు కాబట్టి ఇంకా కూర్చొని ఉన్నాను అంటూ గరమయ్యారు. నిజానికి కోమటిరెడ్డి ప్రసంగిస్తున్న సమయానికి భోజనాల వేళ దాటిపోతోంది. చాలామంది టీచర్లకు షుగర్లు, బీపీలు ఉంటాయి.కాబట్టి తట్టుకోలేక భోజనాలు స్టార్ట్ అవ్వగానే లేచి వెళ్లిపోయారు. దీంతో మంత్రి టీచర్లను ఈ విధంగా నిందించడం మంచి పద్ధతి కాదని టీచర్స్ సంఘాలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: