" వారాణసీతు భువనత్రయ సార భూతా
రమ్యానృణాం సుగతిధాఖిల సేవ్యమానా
అత్రగతా వివిధ దుష్కృత కారణోపి
పాపక్షయే విరజనః ప్రకాశాః"  (నారదపురణాం)

వారుణి మరియు అసి నదులు ఎక్కడయితే గంగలో కలుస్తాయో, ఆ సంగమస్థలంపై ప్రాచీనకాలంలో ఒక విద్య నగరం నిర్మితమైంది. దాని పేరు వారణాసి. వారణాసి తీర్థంలో కాశజాతి వారుండేవారు. అందువల్లే దీనిని కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ వద్ద గంగ ధనుషాకారంలో ప్రవహిస్తుంది. అందవల్ల కాశీకి వశేష మహత్తు ఉంది. దివోదాస్ అనే పేరుగల గొప్ప రాజు ఈ క్షేత్ర వికాసం చేశాడు.


నిర్తికార సేత్య మరియు సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంతో స్త్రీ-పురుష భేదంతో రెండు రూపాలధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి-శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై ఆకాశవాణి ద్వారా తపస్సు చేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమస్థానం ఎంపిక చేశాడు. అప్పుడు నిర్గుణ శివుడు తన నుంచే సమస్త తేజస్సునూ సేకరించి అత్యంత శోభాయమానమైన పంచకోశీ నగరం నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచి శివునికై తపస్సు చేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారణలు ప్రవహించనారంభించాయి. ఈ అద్భుత దృశ్యం చూసి విస్మయం చెంది విష్ణువు తల ఆడించగానే, ఆయన చెవి నుంచి ఒక మణి క్రిందపడింది. అప్పటి నుంచి ఆస్థానం మణికర్ణికగా పేరుగాంచింది. మణికర్ణిక యొక్క ఆ ఐదు క్రోసులు విస్తారంగల సంపూర్ణ జలరాశినీ శివుడు తన త్రిశూలంలో బంధించాడు. దానిలో విష్ణువు, భార్యాసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞద్వారా విష్ణువు నాభినుంచి బ్రహ్మ జన్మించాడు.

బ్రహ్మ యొక్క ఆజ్ఞ ద్వారా అద్భుతసృష్టి జరిగింది. ఇందులో 50కోట్ల యోజనాల విస్తారంలో పద్నాలుగు లోకాలున్నాయి. తమ కర్మతో బద్ధులైన ప్రాణుల ఉద్ధరణకై శివుడు పంచకోశినగరాన్ని అన్ని లోకాల నుండి వేరుగా ఉంచాడు. ఈ నగరాలలోనే శివుడు తన ముక్తిదాయక జ్యోతిర్లింగాలను స్వయంగా స్థాపించాడు. అవి ఈ స్థలాలను విడిచి వెళ్లనే వెళ్లవు. శివుడు తిరిగి కాశీని తన త్రిశూలంలోంచి దింపి, మృత్యులోకంలో ఉంచాడు. బ్రహ్మదినం పూర్తయ్యాక కూడా ఇది నశించదు. కానీ ప్రళయం సంభవించినపుడు శివుడు దానిని మరలా త్రిశూలంలో ధరిస్తాడు. కాశీలో అవిముక్తేశ్వర లింగం సర్వదా ఉంటుంది. పుట్టగతులు లేని ప్రాణులకు వారణాసి పూర్తిగా విముక్తినిస్తుంది.


మహాపుణ్యదాయక పంచకోశనగరి కోటి కోటి రకాల పాతకనాశిని. సంయుజ్య నామంగల ఉత్తమ ముక్తిప్రదాయిని ఈ కారణంగానే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ద్వారా శాశించబడే ఈ నగరంలో దేవతలు కూడా మృత్యువును కోరుకుంటారు.లోపలి నుండి స్తవగుణీయం, బైటనుంచి తమోగుణరుద్రుని ప్రార్ధన చేయబడే పార్వతీ సహిత విశ్వనాథ భగవాన్ శంకరుడు ఈ నగరాన్ని తన స్థిరనివాసంగా చేసుకున్నారు.


కాశీనగరం మోక్షప్రదాయిని, జ్ఞాన ప్రదాయిని, ఇక్కడి నివాసులు ఏ తీర్థయాత్రలు చేయకుండానే ముక్తి పొందుతారు. ఈ కాశీనగరంలో మరణించే ప్రతివ్యక్తి బాల, యువ, వృద్ధ, సుమంగళి, పవిత్ర, అపవిత్ర, ప్రసూత, అప్రసూత, స్వదేశ, అండజ, ఉద్భీజ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర కులాదుల వారందరూ కూడా మోక్షార్హులే. ఇందుకు అణుమాత్రం కూడా సందేహం లేదు. మనుషుడు భోజనం చేస్తున్నా, నిద్రిస్తున్నా, లేక అన్యకార్యాలు వేటిలో నిమగ్నులయినా అవిముక్తేశ్వరుని వద్ద ప్రాణాలు విడిస్తే, అవశ్యం మోక్షప్రాప్తి కలుగుతుంది. ఈ క్షేత్రంలో చేసిన  ఏ సత్కారమైన సహస్రకల్పాలలో కూడా క్షయం కాదు. మానవజన్మ శుభాశుభ ప్రకారాలుగా ఉంటుంది. కాశీవాసులలో రెండు 
రకాల వారికీ ముక్తి లభిస్తుంది.


తరువాతి కాలంలో అనేకులు ఈ జ్ోయతిర్లింగ స్థానంలో ఆలయ నిర్మాణం చేశారు. బనార నామథేయుడైన ఒక రాజు ఈ తీర్థస్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల కాశీని బనారస్ అనికూడా పిలుస్తారు. బనారస్ లో సుమారు పదేహేను వందల భవ్య ఆలయాలున్నాయి. విశ్వేశ్వర మందిర శిఖరం వంద అడుగుల ఎత్తుంటుంది.కాశీనగర మహాత్తు ఎలాంటిదంటే ప్రకృతి వినాశ సమయంలో కూడా ఇది ఎట్టి మార్పులేకుండా అలాగే ఉంటుంది. దండపాణి, కాలబైరవుడూ సంరక్షులుగా ఈ నగరాన్ని కాపాడుతూంటారు. వీరి నివాసం ఎన్నటికీ ఇక్కడే. ఇక్కడి గంగాతీరంలో ఎనభయినాలుగు దృఢమైన ఘాట్ లున్నాయి. ఎన్నో తీర్థకుండాలున్నాయి. వీటి వైభవం వేదకాలం నాటి నుండి వస్తూంది. ఇది హిందువుల పవిత్ర నగరం. ఈ వైభవం అంతా ముస్లిములకు కంటకింపయింది. క్రి.శ. 1033 నుంచి 1669 వరకూ వీరు కాశీని ఎన్నోసార్లు ధ్వంసం చేయబూనారు. ఆలయాలను పడగొట్టి వాటిస్థానే మసీదులు నిర్మించారు. కానీ విశ్వేశ్వరుని కృపవల్ల, హిందువుల భక్తి ప్రభావం వల్ల ఇది పునః జ్యోతిర్లింగ తీర్థంగా విలసిల్లింది. ఆంగ్లేయులు, మరాఠా శాశనకాలంలో ఈ స్థానం గొప్ప వైభవంగా ఉండేది. జైన, బౌద్ధ మతాల వారు దీనిని మరింత ఎక్కువ చేశారు.


ఈ కాశీ విశ్వేశ్వర ఆలయం క్రి.శ. 1777లో అహిల్యాదేవి  హోల్కర్ చే నిర్మించబడింది.క్రీ.శ.1785లో కాశీరాజైన మన్సారామ్, అతని సుపుత్రుడైన జలవంత్ సింహ్ లు వారణాసి పరిసరాలలో ఎన్నో గుడులు కట్టించారు. క్రీ.శ. 1777లో ఔంధ్ పంత్ ప్రతినిధి ఇక్కడగల బందుమాధవుని పురాతన ఆలయాన్ని మర్మత్తు చేయంచి, దాని సౌందర్యాన్ని పునరుద్ధరణ చేశాడు. 1852లో శ్రీమంత్ బాజీరావ్ పిష్వా కాలబైరవ ఆలయం కట్టించాడు. మహారాజా రణజీత్ సింహ్ కాశీవిశ్వనాథ ఆలయాన్ని గోపురాలను సువర్ణ ఖచితం చేయించాడు. ఈ మందిరంలో గల ప్రచండమైన గంట, నేపాల్ రాజు బహూకరించాడు. సారనాథ్ పరిసరాల్లో అనేక బౌద్ధస్తూపాలు, విహారాలు మరియు చైత్య గృహాలూ ఉన్నాయి. 1931లో మహాబోధి సొసైటీ సారనాథ్ లో ఒక అత్యంత సుందర బుద్ధాలయం కట్టించారు.


కాశీ పవిత్రస్థానంలో ఏదైనా విడిచి రావాలని హిందువులు ఇక్కడికి వస్తారు. అనేక ధర్మకార్యాలు చేశాక, తాము ధన్యుల మయ్యాయమని భావిస్తారు. అంతేకాక దేశవిదేశాల నుండి అనేక ధర్మాలకు, మతాలకు చెందిన వారు ఇక్కడికి నిత్యం వస్తూంటారు. ఇక్కడి ఘాట్లు, గుడులు, తపోభూములు ఇంకా ప్రకృతి సౌందర్యం చూసినవారు పులకితులై తదాత్మ్యం చెందుతారు. కాశీ పుణ్యక్షేత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్ర స్థానాలు. ఇక్కడి గంగోదకం భూలోకపు అమృతం. కాశీ క్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తి మర్గాలుగా భావిస్తారు. జయగంగే, జయ విశ్వనాథ, ఓం నమఃశివాయ, ఈ జయనాదాలతో ఇక్కడి వాతావరణం ప్రతి ధ్వనిస్తూంటుంది. 


సంస్కృతంలో కాశీని ఇలా వర్ణించారు.
"విశ్వేశం మాధవం ధుండి. దండిపాణించ భైరవం
వందేకాశీం గృహాంగంగా. భావానీం మణికర్ణికాం."


శ్రీశంకర భగవానుని పన్నెండు లింగాలలో పదవది త్ర్యంబకేశ్వరుని విశిష్టత, యాత్ర వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: