
ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. అతని పేరు ప్రభాత్ ప్రేమీ. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ హోటల్లో ఈ పార్టీ నిర్వహించారు. ఇక పాట వినిపించింది అంటే డాన్స్ చేయకుండా ఉండలేడు ప్రభాత్ ప్రేమి. ఈ క్రమంలోనే అక్కడ డీజే పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేశాడు. ఇదంతా చూసిన వారు విజిల్స్ తో ఆయనను ఎంకరేజ్ చేశారు.
కానీ అంత లో ఊహించని ఘటన. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు ఆయన. పక్కనే ఉన్న వారు దగ్గరికి వెళ్లి చూసేసరికే ఆయన మరణించినట్లు తెలిసి పోయింది. ఇది చూసిన వారు ఎంతో మంది అవాక్కవుతున్నారు. సంతోషంగా సాగిపోతున్న మనిషి జీవితంలో మృత్యువు ఇలా వస్తుందని ఎవరూ ఊ oహిస్తారు అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అతనికి సిపిఆర్ చేసిన కూడా లాభం లేకుండా పోయింది.