కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తి భారీ జరిమానా చెల్లించాడు. ఒడిశాలోని దేవ్గఢ్లో ఓ
పెళ్లి వేడుకకు భారీగా అతిథులను ఆహ్వానించినందుకు అతడికి జరిమానా విధించారు అధికారులు.దేవ్గఢ్లోని
కమలా బాగిచా గ్రామానికి చెందిన వన్ కులన్ టోప్నో.. తన కుమారుడు అమిత్ టోప్నోస్ వివాహ వేడుకలను నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి 800 మంది అతిథులు హాజరయ్యారు.
విషయం తెలుసుకున్న
స్థానిక తహసీల్దార్ పల్లవి
నాయక్,
స్థానిక పోలీసులు..
పెళ్లి మండపానికి చేరుకున్నారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వరుడి తండ్రికి రూ.లక్ష జరిమానా విధించారు.అసలే కరోనా కాలం. నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతూనే ఉన్నారు. కానీ, ఎవరిదారి వారిదే! ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ వ్యక్తి రూ.లక్ష జరిమానా చెల్లించాడు.