ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. చిన్నప్పటి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఐఐటీ ఇంకా ఇతర చదువులు చదవమని తల్లిదండ్రులు విద్యార్థుల్లోని సృజనాత్మకతను చంపేస్తున్నారు. వాళ్లకి నచ్చింది కాకుండా మనకి నచ్చింది చదవమని ఒత్తిడి తెస్తున్నారు. మన అభిప్రాయాలను విద్యార్థులపై రుద్ది మానసికంగా వాళ్లని సంసిద్ధం చేస్తున్నాం. ఇవి తట్టుకోలేక కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మనం చూశాం. ఇప్పుడు ఏకంగా గుండె ఆగిపోవడం వంటి ఘటనలు చూడాల్సి వస్తోంది.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ సంచలనాత్మక పరిశీలనను తీసుకుంటే..గుజరాత్ లో గడిచిన ఆరు నెలల కాలంలో గుండెపోటు కారణంగా 1052 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇందులో 80శాతం మంది 11-25 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా గుండె పోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్ పై దాదాపు 2లక్షల మంది టీచర్లు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.


గుండెపోటుతో 1052మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 80మంది విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యార్థులు ఊబకాయులు కూడా కాదు. హృదయ సంబంధిత రోజుకు సగటున 173 ఎమర్జెన్సీ కాల్స్ అత్యవసర విభాగానికి వస్తున్నాయి అని గుజరాత్ విద్యాశాఖ మంత్రి కుబేర్ డిండోర్ వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా చిన్న వయసు వారే ఉండటంతో గుండెపోటుపై యువకుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.


క్రికెట్ ఆడుతుండగా.. గార్భా నృత్యం చేస్తున్న సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు సీపీఆర్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న శిక్షణా శిబిరంలో పాల్గొనాలని ఉపాధ్యాయులందరూ భాగస్వామ్యం కావాలని ఆయన సూచించారు. తద్వారా విద్యార్థుల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ మరణాలు చూస్తుంటే విద్యార్థి దశ నుంచే వారిపై ఎంత ఒత్తిడి తీసుకువస్తున్నారో అర్థం అవుతుంది. బిడ్డలు ప్రాణాలు కావాలో లేక మన అభిప్రాయం నెగ్గాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: