మనమెదడు అనేక విషయాలను గుర్తుంచుకోవడం, సమస్యలు పరిష్కరించడం, ఏకాగ్రతగా పని చేయడం వంటి అనేక పనులను చేస్తుంది. అయితే శారీరక, మానసిక ఒత్తిడులు, మంచి ఆహారాభావం, నిద్రలేమి, వయస్సు పెరగడం వంటి కారణాలతో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుంది. అయితే పూర్వీకులు చెప్పిన కొన్ని ప్రకృతి ఆధారిత చిట్కాలను పాటించడంవల్ల మెదడుకు బలమిస్తూ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. జ్ఞాపకశక్తిని పెంచే కొన్ని ఇంటి చిట్కాలు మరియు సహజ రెమెడీలు మీకు అందిస్తున్నాం. బ్రాహ్మి లీవ్స్ లేదా బ్రాహ్మి పొడి. బ్రాహ్మి ఆయుర్వేదంలో మెదడుకు అమృతంగా భావిస్తారు. రోజూ ఉదయం 1 టీస్పూన్ బ్రాహ్మి పొడిని తేనె లేదా వెచ్చని పాలతో కలిపి తినండి.

 ఇది మేధాశక్తిని పెంచుతుంది, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. బాదం మిశ్రమం, రాత్రి 6-8 బాదం నానబెట్టండి. ఉదయం తొక్కలు తీసి మిక్సీ చేసుకుని పాలలో కలిపి తాగండి. బాదంలో విటమిన్ E, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి – ఇవి మెదడుకి అవసరమైనవి. ఆవాల నూనె లేదా బ్రాహ్మి ఆయిల్‌తో తలకు వారం లో రెండు సార్లు మర్దన చేయండి. మెదడు నరాలకు రక్త ప్రసరణ మెరుగవుతుంది, ఆలోచన తేలికగా ఉంటుంది. ఇది స్ట్రెస్‌ని తగ్గిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అశ్వగంధ పొడిని 1 టీస్పూన్ పాలలో కలిపి రోజూ రాత్రి తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తేనెతో కలిపిన గింజలు మిశ్రమం,  బాదం + అఖరోట్  + ఖర్జూరం + ఖుబానీ నానబెట్టి ఉదయం తినడం వల్ల మెదడు శక్తి పెరుగుతుంది. వీటిని తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.

బ్రాహ్మరి ప్రాణాయామం – మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. పధ్మాసనం & ధ్యానం – రోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శవాసనం – నిద్ర తక్కువగా ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది. వాల్‌నట్స్– మెదడు ఆకారంలోనే ఉండే ఈ గింజ మెదడుకు గొప్ప ఆహారం. పొట్టిన కూరగాయలు – ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్ – వీటిలో ఐరన్, విటమిన్లు ఉండటంతో మెదడు పనితీరు మెరుగవుతుంది. గ్రీన్ టీ – శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి.పెరుగు – ప్రోబయాటిక్స్ మెదడుకు హెల్ప్ చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: