హాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ధనుష్ ఒకరు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కుబేర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... నాగార్జున ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైం విషయంలో మేకర్స్ ఇప్పటికే ఓ క్లారిటీ కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఏకంగా 2 గంటల 50 నిమిషాల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 2 గంటల 30 నిమిషాల వరకు ఏ సినిమా అది అయినా యావరేజ్ రన్ టైం గా చూసుకోవచ్చు. కానీ 2 గంటల 30 నిమిషాలు దాటి ఏకంగా కుబేర సినిమా 2 గంటల 50 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే వార్తలు రావడంతో చాలా మంది కుబేర మూవీ మేకర్స్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు.

సినిమా ఏ కాస్త బోర్ కొట్టిన కూడా ప్రేక్షకులు మూవీ నుండి డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సినిమాకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతూ ఉంటే , మరి కొంత మంది మాత్రం సినిమా కంటెంట్ బాగుంటే మూడు గంటల కంటే రన్ టైం ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కుబేర సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: