రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత్ రావాలని కోరు కుంటున్నట్లు ఒక సంకేతాన్ని పంపించాడు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ నోరు మెదపలేదు. ఎందుకంటే భారత్ ఇటు అమెరికాతో, అటు రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. తటస్థ వైఖరి సాగిస్తూ ముందుకెళుతుంది. యుద్దం ప్రారంభమైన తర్వాత యూరప్ దేశాల్లోని కొన్ని పార్లమెంటుల్లో జెలెన్ స్కీ అతిథి ఉపన్యాసం చేశారు. ప్రపంచం గర్వించ దగిన నేతగా పేరు తెచ్చుకునుందుకు తాపత్రాయ పడ్డారు.


రష్యా లాంటి కొండను ఢీకొనేందుకు అమెరికా, యూరప్ లా సాయం తీసుకున్నాడు. దీంతో ఆయా దేశాలు జెలెన్ స్కీని ఆహ్వానించాయి. అంతే కాకుండా తమ పార్లమెంటులో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చాయి. కానీ ఇప్పటికి యుద్ధం ప్రారంభమై 500 రోజుల పైనే అవుతోంది. ఎలాంటి ముగింపు లేకుండా ఇంకా కొనసాగుతూనే ఉంది.


ఇప్పుడు జెలెన్ స్కీ కన్ను భారత్ పై పడింది. భారత్ రావాలని అనుకుంటున్నట్లు భారత విదేశాంగ శాఖకు సందేశం పంపించారు. అయితే ఈ విషయంలో భారత విదేశాంగ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశం ప్రస్తుతం రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ ను కొనుక్కుంటుంది. ముఖ్యంగా ఆయిల్ కొను గోలు వల్ల భారత్ లో చాలా వరకు సమస్యలు తీరుతున్నాయి. ఇప్పుడు జెలె న్ స్కీ గనక ఇండియా వస్తే రష్యా తో ఉన్న అను బంధం దెబ్బతినే అవకాశం ఉంది.
 

రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటి వరకు అనేక దేశాలు మద్దతు ఇచ్చినా ఎక్కడా కూాడా భారత్ యుద్ధానికి మద్దతు ప్రకటించలేదు. న్యూట్రల్ విధానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వచ్చి భారత్ లో పర్యటిస్తే రష్యాతో భారత్ కు కచ్చితంగా సంబంధాలు దెబ్బతింటాయి. పరస్పరం సహకరించుకునే దేశాల మధ్య శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: