సూపర్ స్టార్ కృష్ణ అంటే టాలీవుడ్ కి  ఒక ప్రభంజనం. ఎందుకంటే బోరింగ్ గా వున్న సినీ పరిశ్రమకు ఎలాంటి కొత్త మార్పు తేవాలన్నా ముందుగా ఆయనే ప్రయోగాలు చేసేవారు. ఆ సినిమా ఫలితం ఎలా వున్న కొత్త దనం చూపించి ఆహా అని ఆకట్టుకునేవారు.ఆయనలా అలా డేరింగ్ అప్పట్లో ఎవరూ చేసేవాళ్ళు కారు.అలాంటి డేరింగ్ కృష్ణ గారు కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. కానీ అది కొంత కాలమే. ఆయన లోక్‌సభ మాజీ ఎంపీ ఆని ఈ తరంలో చాలా మందికి కూడా తెలియదు. అప్పట్లో కృష్ణ గారి రాజకీయ పోరాటం ఓ రేంజ్‌లో ఉండేది.సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్లి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అప్పుడు ఆయనకు సినీపరిశ్రమ పూర్తి స్థాయిలో సపోర్ట్ గా నిలిచింది. సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఎన్టీఆర్ గారి తొలి ఎన్నికలు ఎదుర్కొనే ముందు ఈనాడు అనే సినిమాను తీశారు. ఆ సినిమా తెలుగుదేశం పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో.. టీడీపీకి బాగా ప్లస్ అయింది. అయితే తర్వాత కొన్ని కారణాల వల్ల కృష్ణ ఎన్టీఆర్‌కు దూరమయ్యారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ సమయంలో కృష్ణ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఫుల్ పేజీ పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. 


దాంతో ఎన్టీఆర్ ఇంకా కృష్ణ ప్రత్యర్థులయ్యారు.ఇందిరా గాంధీ గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణకు స్నేహం ఏర్పడింది. ఎన్టీఆర్‌ కు కృష్ణ గారు దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను ప్రోత్సహించింది. ఎన్టీఆర్ లాంటి నేతకు.. కృష్ణనే ధీటైన సమాధానం చెప్పగలరని భావించింది. అప్పట్లో కృష్ణ కూడా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా అనేక సినిమాలు రూపొందించారు.అయితే కొన్ని  సినిమాల విడుదలకు ఆటంకాలు కూడా ఎదురయ్యేవి. అయితే కృష్ణ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత నేరుగా ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989లో ఏలూరు నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఏకంగా 71వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే తర్వాత రాజీవ్ గాంధీ మరణించడంతో రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1991లో మధ్యంతర ఎన్నికల్లో కృష్ణ గారు పరాజయం పాలయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనను గుర్తించే వారు తగ్గిపోవడంతో కృష్ణ రాజకీయాలకు మెల్లగా దూరమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: