
మాజీ సీఎం వైఎస్ జగన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతూ ప్రత్యర్థి నేతలకు వణుకు పుట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజల్లో తనకు ఊహించని స్థాయిలో స్పందన వస్తున్న నేపథ్యంలో తీసుకునే నిర్ణయాల విషయంలో జగన్ అస్సలు వెనుకడుగు వేయడం లేదు. 2019లో వైసీపీ నవరత్నాలతో అధికారంలోకి రాగా కూటమి సూపర్ సిక్స్ పథకాల ద్వారా 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చింది.
వైసీపీ పథకాలను ఏ నిబంధనలతో అమలు చేసిందో కూటమి సర్కార్ కూడా అవే తరహా పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. కూటమి సర్కార్ గతేడాది ఎక్కువ సంఖ్యలో పథకాలను అమలు చేయలేదనే సంగతి తెలిసిందే. అన్నదాత సుఖీభవ, ఇతర పథకాల అమలు అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఉచిత బస్సు పథకం వచ్చే నెల నుంచి అమలు కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం.
జగన్ బాబు ష్యురీటీ మోసం గ్యారెంటీ గురించి ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టామని ఈ నెల 21 నుంచి గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమం అమలు అయ్యేలా అడుగులు పడతాయని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిందేంటో చేసిందేంటో క్యూఆర్ కోడ్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజలు అన్ని విషయాలు తెలుసుకునేలా అడుగులు వేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.
తన కామెంట్లతో జగన్ ప్రత్యర్థి నేతలకు వణుకు పుట్టించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది. జగన్ రాజకీయాల్లో పూర్వ వైభవం పొందడానికి కష్టపడుతూ ఉండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు