
అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన ఏ హీరోయిన్ తో మీకు డాన్స్ చేయడం కష్టంగా అనిపించింది అని అడిగినప్పుడు ఆయన తమన్న పేరుని చెప్పుకొచ్చారట. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ కి ఎదురైన ప్రశ్నకు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి . "మీకు ఏ హీరోయిన్ తో నటించేటప్పుడు , డాన్స్ చేసేటప్పుడు కష్టంగా అనిపించింది " అని హోస్ట్ ప్రశ్నించగా .."నటించేటప్పుడు ఏ హీరోయిన్ తో నాకు ఇబ్బంది కలగలేదు కానీ డాన్స్ విషయంలో మాత్రం తమన్నాతో పోటీ పడలేకపోయాను. తను చాలా బాగా డాన్స్ చేస్తుంది " అంటూ ప్రభాస్ ఆన్సర్ ఇచ్చారట .
దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ డాన్స్ విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోడు . నెమ్మదిగా స్టెప్స్ ని ఫినిష్ చేస్తాడు . కానీ తమన్నా అలా కాదు బాడిని గిరగిరా తిప్పేస్తుంది. వీళ్ళిద్దరి కాంబోలో బాహుబలి సినిమా వచ్చింది . అదేవిధంగా రెబల్ సినిమా వచ్చింది . బాహుబలి సినిమాలో వీళ్లిద్దరి మధ్య చిత్రీకరించిన పచ్చబొట్టేసిన సాంగ్ ఎంత హైలెట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ పాట లవర్స్ కు బాగా కిక్ ఇచ్చింది. ప్రసెంట్ ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి సినిమా షూట్ లతో బిజీ గా ఉన్నారు..!!