అన్ని మంత్రాలకు అధిష్ఠానదేవత ‘‘ గాయత్రి ’’ అన్ని మంత్రాలకు మూలం ఈ 24 అక్షరాల మంత్రమే. ఈ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలతో వాల్మీకి రామాయణం లోని 24 వేల శ్లోకాలు ప్రారంభమవుతాయి. కనుకనే ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని చదివితే రామాయణం చదివి నంత పుణ్యం కలిగితీరుతుందంటారు. కనుకనే విశ్వామిత్ర మహర్షి ఏర్పరచిన సంధ్యా వందన క్రియలో మూడు పూటలా గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసేవారికి మోక్షం తప్పక అభిస్తుందంటారు. ‘‘ ఓ భూర్భవస్సువం: ఓ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!’’ ఈ మంత్రానికి అర్థాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ‘‘ ఓం అనే పరబ్రహ్మం, సత్తు, చిత్తు, ఆనందస్వరూపం. మాబుద్దిని ప్రేరేపించేటటువంటి జగత్కారణమైన పవిత్ర దైవతత్వమైన ఆ తేజస్సును మేము ధ్యానిస్తున్నాం ’’ అని ఒక అర్థముంది. ‘‘ అంతర్గతంగా ఉన్న చీకట్లను పారద్రోలినట్లే ఆదిత్యుడు లోకాన చీకట్లు తొలగిస్తాడు. ఆ తేజస్సును అన్ని చీకట్లను తొలగించేందుకు పూజిస్తున్నాం’’ అని మరో అర్థముంది. ఈ గాయత్రీ మంత్రానికి.  

మరింత సమాచారం తెలుసుకోండి: