ఇండియాస్ ఎస్‌యూవీ స్పెషలిస్ట్ అయిన మహీంద్రా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన మొట్టమొదటి అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు కలిగిన ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు స్వల్పంగా తగ్గాయి.మహీంద్రా గతేడాది చివర్లో తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని విశిష్టమైన డిజైన్ ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్ల కారణంగా ఇది మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఈ మోడల్‌లో కొన్ని వేరియంట్ల కోసం దాదాపు 8 నుండి 12 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంటోందని సమాచారం. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ధరలు తగ్గడం చాలా అరుదు. అయితే, ఇప్పుడు ఇందులో ఎంపిక చేసిన వేరియంట్లపై సుమారు రూ.6,000 వరకూ ధరలు తగ్గాయి.మహీంద్రా నుండి ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటిగా ఉన్న ఎక్స్‌యూవీ700 ఇప్పటికే 1.5 లక్షలకు పైగా బుకింగ్‌లను కలిగి ఉంది. పెండింగ్‌లో ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు మహీంద్రా కూడా గట్టిగానే కృషి చేస్తోంది. అయితే, పెరుగుతున్న డిమాండ్ ఇంకా సప్లయ్ చైన్‌లోని అంతరాయాల కారణంగా కంపెనీ తగిన స్థాయిలో వాహనాల ఉత్పత్తిని సాధించలేకపోతోంది. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీలోని ఎంపిక చేసిన వేరియంట్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్‌లు 1 సంవత్సరానికి పైగా ఉంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో ఎక్కువగా డీజిల్ వేరియంట్‌లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో, డీజిల్ వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ చాలా అధికంగా ఉంది. అయితే, పెట్రోల్ వేరియంట్‌ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం కాస్తంత తక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఎస్‌యూవీ  టాప్-ఎండ్ 'AX' వేరియంట్‌లతో పోలిస్తే బేస్ 'MX' వేరియంట్ చాలా తక్కువ వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉంది. ప్రస్తుతం, మహీంద్రా భారతదేశంలో సగటున ప్రతినెలా సుమారు 6,000 యూనిట్ల ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేస్తోంది. ఇది ఈ ఎస్‌యూవీ కోసం ఉన్న సగటు బుకింగ్ కంటే చాలా తక్కువ.ఎక్స్‌యూవీ700 పెట్రోల్ ఇంకా డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మ్యాన్యువల్ అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మాక్సిమం 197 బిహెచ్‌పి శక్తిని ఇంకా 380 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, దీని 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ రెండు ట్యూన్లలో లభిస్తుంది. మొదటిది 182 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఇంకా 450 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, 'MX' వేరియంట్‌లో ఉపయోగించిన ఇదే డీజిల్ ఇంజన్ 153 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఇంకా 360 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: