దాదాపు మూడు నెలల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చారు. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు.  ఏపీ ప్రభుత్వం సరగా స్పందిచండం లేదని విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఇప్పటి వరకు తెలంగాణ అంశంపై నోరు మెదపని చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో విర్రవీగితే ఏమువుతుందో తెలంగాణలో చూశామని పేర్కొన్నారు.


ఏపీలో జగన్ ప్రభుత్వం అహంకారంతో ముందుకు సాగుతుందని.. తెలంగాణలో కేసీఆర్ కు పట్టిన గతే జగన్ కు పడుతుందని హెచ్చరించారు.  మరో వైపు మూడు నెలల తర్వాత ఏపీలోను తెలంగాణ పరిస్థితే అంటూ జోస్యం చెప్పారు.  అయితే ఏపీ సీఎం జగన్ కూడా చంద్రబాబుపై పలు విమర్శలు సంధించారు. విపత్తుల సమయంలో ఇరు పార్టీల అధినేతలు అవలంబిస్తున్న తీరు పూర్తి విభిన్నంగా ఉంది.


విపత్తుల సమయంలో చంద్రబాబు నేరుగా సహాయక చర్యల్లో పాల్గొనేవారు. తితిలీ తుపాన్ వచ్చిన సమయంలో శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పది రోజులు ఉండి పోయారు. స్వయంగా సహాయక చర్యల్లో పాల్గోన్నారు. హుద్ హుద్ తుపాన్ వంటి సమయంలో విశాఖ నగరం నామారూపాలు లేకుండా పోయింది. అప్పుడు కూడా చంద్రబాబు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.


ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా ఎన్నో విపత్తులు సంభవించాయి. కానీ నేరుగా జగన్ వాటిలో పాల్గొన్న దాఖలాలు లేవు.  దీనిపై సీఎం జగన్ ఓ సభలో స్పందిస్తూ.. తాను నేరుగా సహాయక చర్యల్లో పాల్గొంటూ అధికారులను తన వెంట తిప్పుకుంటూ వారి పనికి అడ్డుపడను. నాకు చంద్రబాబులా ఫొటోకి పోజులు ఇవ్వడం రాదు. నాకు వచ్చిందల్లా ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడం. నేను కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేస్తాను. వారంలోగా పనులన్నీ జరిగిపోవాలని సూచిస్తాను. ఆ తర్వాత అవన్నీ సక్రమంగా జరిగాయా లేదా అని  సమీక్ష నిర్వహించి అందిన సహకారాలపై ఆరా తీస్తాను. ఇది నాకు తెలిసిన పద్ధతి అంటూ వివరించారు. అయితే వీరిద్దరి విధానాల్లో ఎవరిది బాగుందో నిర్ణయించాల్సింది ప్రజలే.

మరింత సమాచారం తెలుసుకోండి: