బ్యాంక్‌ ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూపులు చూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్యాంకు నోటిఫికేషన్ వచ్చేసింది.5, 454 పోస్ట్ లతో ఒక్కసారిగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. క్లరికల్‌ కేడర్‌లో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మరి ఒకసారి ఆ వివరాల్లోకి వెళదామా. !మొత్తంగా ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)–2021 ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 5,454 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్‌ నియామకాల ద్వారా 5,000 పోస్ట్‌లను, బ్యాక్‌లాగ్‌ 454 ఖాళీలకు నియామకాలు చేపట్టనుంది.ఈ మొత్తం పోస్టులలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 275 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.ఈ ఉద్యోగాలకి అర్హతల గురించి తెలుసుకుందాం. బ్యాచిలర్‌ డిగ్రీలో  ఉత్తీర్ణత సాధించి ఉండాలి.అలాగే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు  చేసుకోవచ్చు.అయితే వీళ్లు 2021, ఆగస్ట్‌ 16 లోపు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.ఇకపోతే ఉద్యోగానికి అప్లై చేసే వారి వయస్సు ఏప్రిల్‌ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్‌సీ/ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.


ఈ బ్యాంకు ఉద్యోగాలకి ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.మే 17, 2021లోపు దరఖాస్తు చేసుకోవాలి
ఈ ఉద్యోగాలకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ నెలలో జరుగనుంది.అలాగే మెయిన్‌ ఎగ్జామినేషన్‌  జూలై 31, 2021లో జరగనుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌ కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిలాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసారు. వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers.



ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్‌. ముందుగా ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు.ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్‌ రెండూ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. అలాగే ఈ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత వేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.మెయిన్‌ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో ఉంటుంది. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50ప్రశ్నలు–60 మార్కులకు చొప్పున మొత్తంగా190 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: