దక్షిణాఫ్రికాలో బయలుదేరిన కొత్త వేరియంట్ అనుకున్నట్టుగానే వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్పటికే 80పైగా దేశాలలో ఈ కేసులు వెలుగు చూశాయి. కొన్ని దేశాలలో వ్యాప్తి కూడా తీవ్రంగానే ఉంటుంది. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అందరిని హెచ్చరించింది. అలసత్వం వహిస్తే, ఫలితం తీవ్రంగా ఉంటుంది అని స్పష్టం చేసింది. ఈ వేరియంట్ తో పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ, ఎక్కువ మందికి అది వ్యాప్తి చెందటం వలన సరైన సమయంలో వైద్యం అందే అవకాశాలు తక్కువ అని, అలా జరగటం వలన నష్టం వాటిల్లే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అని అందరు గ్రహించాల్సి ఉంది. ఇప్పటికే వ్యాప్తి చెందిన దేశాల నుండి మరోసారి అంతర్జాతీయ ప్రయాణాలు నిలిపివేస్తున్నారు.

ఇదే కొనసాగితే మరోసారి ప్రపంచం లాక్ డౌన్ దిశగా వెళ్లే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. భారత్ లో కూడా ఇప్పటికే 101 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క మహారాష్ట్రలోని 32 కేసులు నమోదు అయ్యాయి. తరువాత స్థానంలో 22 కేసులతో ఢిల్లీ ఉండగా, 17 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది. భారత్ లో కూడా వేగంగానే వ్యాప్తి జరుగుతుంది. అందుకే మరోసారి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలను హెచ్చరించింది. ప్రమాదం లేదని చెప్తున్నామని అందరు లైట్ తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. వైరస్ తో ప్రమాదం లేకపోవచ్చు. కానీ అది విస్తరించడం వలన ఆసుపత్రులకు బాధితులు బారులు కట్టే సందర్భాలు వస్తాయని, అది ప్రమాదం అని తెలిపారు.

గతంలో ఆసుపత్రులలో కనీసం బెడ్స్ లేక ఇబ్బంది పడ్డ పరిస్థితి కొని తెచ్చుకోవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దానికి తగ్గట్టుగా ఆసుపత్రులు కానీ, సిబ్బంది కానీ ప్రస్తుతం సిద్ధంగా లేరనేది అందరు గుర్తించాలని వారు తెలిపారు. రెండో వేవ్ లో పరిస్థితి చుసిన తరువాత కూడా ప్రజలలో ముందస్తు జాగర్తలపై అలసత్వం ఉంటె, పరిస్థితి చేయి దాటిపోయే అవకాశాలు లేకపోలేదు అనేది అందరు గ్రహించాల్సి ఉంది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం కాదని అందరు గ్రహించాలి. కొత్త కాలం కఠినంగా నిబంధనలు పాటించడం ద్వారా దానిని తేలికగా ఎదుర్కోవచ్చు అని తెలిసి కూడా పరిస్థితిని పీకలదాకా తెచ్చుకోవద్దని సూచన చేశారు. పరిస్థితి చేయి దాటిపోతే, దానిలో ఎంతో శ్రమ, ఆర్థికనష్టం లాంటి పలు అంశాలు ఉంటాయి. వాటిని కాస్త జాగర్త వహించడం ద్వారా మరో అవసరానికి వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. లేకపోతే రెంటికి చెడ్డ రేవడిగా పరిస్థితి అయిపోగలదు. జాగర్తకు మించినది లేదు. వాక్సిన్ తీసుకున్నవారు కూడా పూర్తిగా జాగర్తలు పాటించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: