ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు రీసెంట్ గా కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ మరణించిన సంగతి తెలిసిందే. శరత్ బాబు మరణం తెలుగు, తమిళ పరిశ్రమల్లో పూర్తిగా విషాదాన్ని నింపింది.కమల్, రజిని, చిరంజీవి.. లాంటి స్టార్ పెద్ద హీరోలు శరత్ బాబుకి నివాళులు అర్పించారు. సౌత్ భాషల్లో దాదాపు 300 సినిమాలలో హీరోగా, విలన్ గా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతగానో మెప్పించారు శరత్ బాబు.అయితే శరత్ బాబు వైవాహిక జీవితం మాత్రం సంతోషంగా లేదు. మొదట రమప్రభని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల కాపురం తర్వాత వారు విడిపోయారు. ఆ తరువాత స్నేహ అనే ఆమెను వివాహం చేసుకోగా ఆమెతో కూడా విడిపోయారు శరత్ బాబు. ఈ ఇద్దరితో కూడా శరత్ బాబుకి సంతానం కలగలేదు. అందువల్ల శరత్ బాబుకి వారసులు ఎవరూ లేరు.అయితే శరత్ బాబు సినిమాల్లో బాగానే సంపాదించారని సమాచారం. చెన్నై, హైదరాబాద్ ఇంకా తన సొంతూరు ఆముదాలవలసలో శరత్ బాబుకు ఇల్లు ఇంకా ఆస్తులు ఉన్నట్టు సమాచారం.


కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు శరత్ బాబుకు ఉన్నట్టు సమాచారం తెలుస్తోంది. అయితే ఆ ఆస్తి అంతా కూడా ఇప్పుడు ఎవరికి చెందుతుందని ఇప్పుడు ప్రశ్నగా మారింది. శరత్ బాబుతో కలిసి  అక్కాచెల్లెళ్లు ఇంకా అన్నతమ్ములు మొత్తం 13 మంది  అని, వాళ్ళ పిల్లల చదువులు, పెళ్లిళ్లకు కూడా శరత్ బాబు సహాయం చేశాడని శరత్ బాబు సోదరి ఇటీవల తెలిపారు.ఇక ఇటీవల శరత్ బాబు అంత్యక్రియల సమయంలో అయన సోదరులని కొంతమంది ఆస్తుల గురించి ప్రశ్నించగా.. అది ఇప్పుడు అసలు మాట్లాడే సమయం కాదని, ఆయన వీలునామా రాస్తే దాని ప్రకారమే అవి చెందుతాయని, లేకపోతే మా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటామని తెలిపినట్టు అన్నారు. దీంతో శరత్ బాబు కోట్ల విలువ చేసే ఆస్తులు తన సోదరులు ఇంకా సోదరీమణులకు వెళ్తాయని టాక్ నడుస్తోంది.అయితే ఈ ఆస్తుల విషయంలో వారి మధ్య గొడవలు కూడా రావొచ్చని, ఇప్పటికే ఆ గొడవలు కూడా నడుస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: