
చిరంజీవి 1983 వ సంవత్సరంలో విడుదల అయిన ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. అప్పటి వరకు మామూలు హీరోగా ఉన్న చిరంజీవి ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మారిపోయాడు.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చాలా సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన శివ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఈ మూవీ తో నాగార్జున ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టిఆర్ ... వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఆది మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మారి పోయాడు. అంతకు ముందు ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఈ మూవీ తోనే ఈ హీరోకు మాస్ జనాల్లో అద్భుతమైన క్రేజ్ లభించింది.
వీరితో పాటు మరి కొంత మంది కూడా ఒకే ఒక మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోలుగా మారిన వారు ఉన్నారు.