తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోహన్ బాబు అనే పేరు కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అలాంటి మోహన్ బాబు ఇంట్లో జరిగిన ఒక సంఘటన వల్ల ఆయన పరువు పోతుందనే చెప్పాలి అదేంటంటే ఆయన ఇద్దరు కొడుకులు గొడవ పడటం ఒక 2 నెలల క్రితం జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఇలాంటి కారణాల వల్ల గత కొద్ది రోజులుగా మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే.

అప్పటికే వివాహం జరిగి ఒక కొడుకు వున్న భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డిని మనోజ్ వివాహం చేసుకోవడం.. ఇక ఈయన కూడా ఇదివరకే పెళ్లి అయ్యి ఆమెతో విడాకులు తీసుకోవడం అన్నీ కూడా హాట్ టాపిక్ గా మార్చాయి. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత వారిద్దరూ ఒకరినొకరు ఇష్ట పడి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. పైగా మౌనిక కొడుకును తన కొడుకులా చూసుకుంటానని మాట కూడా ఇచ్చారు మంచు మనోజ్.

ఇక ఆ కారణాలవల్లే మనోజ్ పెళ్లికి అన్న విష్ణు వచ్చినా చుట్టము చూపుగా వచ్చాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరొకవైపు మనోజ్ రెండో పెళ్లి మంచు ఫ్యామిలీలో అసలు ఇష్టం లేదని.. అయినా సరే మనోజ్ కోసం ఈ పెళ్లికి మోహన్ బాబు దంపతులు హాజరయ్యారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ మనోజ్ పెండ్లి విష్ణుకు నిజంగానే ఇష్టం లేదా అని అడగ్గా.. అవును అంటూ ఆన్సర్ ఇచ్చింది లక్ష్మి.. దాంతో ఈమె షేర్ చేసిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే మొన్నా మధ్య జరిగిన గొడవ కూడా నిజమే నన్నమాట అంటూ నెటిజన్లు కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు. మరి అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవల్లో మంచు లక్ష్మి ఎవరి వైపు నిలబడుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి మంచు మనోజ్ కు మంచు లక్ష్మికి మంచి అవినాభావ సంబంధం ఉంది.. అందుకే మనోజ్ వైపే నిలబడొచ్చు అన్న ఒక కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఇకపోతే గొడవ జరిగినప్పటి నుంచి మంచు మనోజ్ తో విష్ణుకి మాటల్లేవు అని ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: