వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు చేసే కామెంట్లు చాలా వివాదాస్పదంగా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అయితే చాలా మంది ఆడవారికి అస్సలు నచ్చవు. ఈయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంతోమంది స్పందిస్తూ ఆయన్ని సోషల్ మీడియా వేదికగా ఏకీపారేస్తూ ఉంటారు. అయితే అలాంటి రాంగోపాల్ వర్మ తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బ్యాక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మరి ఇంతకీ ఆయన ఏం కామెంట్ చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కాంబోలో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్-2 మూవీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా విడుదలైన ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే లక్షల వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ పై విమర్శల వర్షం కురుస్తోంది. 

సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పై తెగ ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా వార్-2  మూవీలో హృతిక్ రోషన్ కి బాడీకి కరెక్ట్ గా సెట్ అవ్వాలంటే ఆయన కటౌట్ ఉన్న హీరోని ఎంచుకుంటే బాగుండు.. కానీ ఎన్టీఆర్ హైట్ తక్కువ ఉన్నాడు.ఆయన ఈ సినిమాలో హృతిక్ రోషన్ కి అస్సలు సెట్ అవ్వడు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా వార్ -2  టీజర్ పై స్పందించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఈ టీజర్ చూసి ఒక వివాదాస్పద పోస్ట్ చేశారు

  ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కియారా అద్వానీ ని ఉద్దేశిస్తూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ల పేర్లు మెన్షన్ చేస్తూ కియారా అద్వానీ బ్యాక్ క్లోజప్ షార్ట్ పెట్టి వీరిద్దరిలోకియారా అద్వానీ బ్యాక్ ఏ హీరోకి దక్కుతుందో అంటూ ఒక వివాదాస్పద బోల్డ్ అయినటువంటి కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ పెట్టిన ఈ బోల్డ్ కామెంట్ పట్ల చాలామంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.ఒక దర్శకుడిగా హీరోయిన్ పై చేయాల్సిన కామెంట్స్ ఇదేనా అంటూ మండిపడుతున్నారు.. అయితే రాంగోపాల్ వర్మ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ల విషయంలో చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: