సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా కూలీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఆగస్టు 14 వ తేదీన విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ను రాబట్టింది.

అలాగే ఆ తర్వాత కొన్ని రోజులు కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మంచి కలెక్షన్లను రాబట్టిన ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని పెద్ద లాభాలను అందుకునే విషయంలో మాత్రం ఫెయిల్యూర్ అయింది. ఇది ఇలా ఉంటే కొంత మంది జనాలు ఈ సినిమా ఎప్పుడు ఓ టీ టీ లోకి వస్తుందా ... ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలా ఈ సినిమాను ఓ టీ టీ చూద్దాం అనుకునే వారికి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓ టీ టీ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల అయింది.

మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు సెప్టెంబర్ 11 వ తేదీ నుండి తమిళ్ , తెలుగు , మలయాళ , కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ గారు తాజాగా  అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: