
ఎవరైనా కరోనా నిబందలను అతిక్రమిస్తే వారిపై వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఆంధ్రలో నైట్ కర్ఫ్యూ మొదలైన విషయం తెలిసిందే. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా నైట్ కర్ఫ్యులను అమలు చేస్తుండగా ఇపుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని జనవరి 10 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ మొదలయ్యింది. రాత్రి కర్ఫ్యూ కారణంగా షిఫ్ట్ ల ప్రకారం డ్యూటీలు చేస్తూ పకడ్బందీగా కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అయితే ఇపుడు ఇందుకు సంబంధించి మరో వార్త హాట్ టాపిక్ గా మారింది.
కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ఇపుడు ఏపి ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అది పెద్ద పండుగ సంక్రాంతికి ముందా లేక తర్వాత అన్న అంశంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా విజృంభణను కట్టడి చేసేందుకు ఏపి ప్రభుత్వం ఈ తరహా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్యాబినెట్ భేటీ జరపనున్నారు అట. ఈ భేటీలో ఈ కీలక విషయంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఉంటుందా లేదా ఇంకొన్నిరోజులు ఆగితే తెలుస్తుంది.