ఈ అనంత విశ్వంలో అంతుబట్టని విషయాలు ఇంకా పదార్థాలు ఎన్నున్నాయో ఊహకు కూడా అందవని అందరికీ తెలుసు. ఇక ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా భూమి వాతారణంలో అత్యంత ప్రతిస్పందించే పదార్ధపు కొత్త రకం అయిన ఆర్గానిక్ హైడ్రోట్రియాక్సైడ్లు (ROOOH)లను శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది.ఈ పదార్ధం అనేది అసలు ఇంతవరకూ కూడా మనకి తెలియని ప్రభావాలను కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుమించి, ఇక ఇది మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని లేదంటే ప్రపంచ పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.ఎన్నో వాతావరణ సంబంధిత RO2 రాడికల్స్ నుండి ROOOH ఏర్పడటం గురించి ప్రత్యక్ష పరిశీలనను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.ఇక ట్రైయాక్సైడ్లు అంటే, మూడు ఆక్సిజన్ పరమాణువులు ఒకదానికొకటి జతచేయబడిన సమ్మేళనాలు.ఇంకా అలాగే కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం, ఈ ట్రైయాక్సైడ్లు వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడతాయి. ఇక రెండు ఆక్సిజన్ పరమాణువులు జతచేయబడిన పెరాక్సైడ్‌ల కంటే ట్రైయాక్సైడ్‌లు చాలా ఎక్కువ రియాక్టివ్‌గా ఉంటాయి. 



అలాగే, వాతావరణంలో కూడా ట్రైయాక్సైడ్లు ఉండే అవకాశం అనేది ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, ఇది ఇప్పటివరకు కూడా రుజువు కాలేదు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హెన్రిక్ గ్రుమ్ క్జర్‌గార్డ్ ప్రస్తుత సమాచారం ప్రకారం, "ఈ సమ్మేళనాలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని, అయితే వాటి గురించి మనకు తెలియదు" అని వారు అన్నారు. "కానీ సమ్మేళనాలు ఏర్పడి నిర్దిష్ట సమయం దాకా కూడా జీవిస్తాయనే సాక్ష్యం ఇప్పుడు మన దగ్గర ఉంది. కాబట్టి, వాటి ప్రభావాన్ని అధ్యయనం చేయడం ఇంకా అలాగే అవి ప్రమాదకరంగా మారితే స్పందించడం సాధ్యమవుతుంది," అని చెప్పారు. అయితే, ఇక "అవి చాలా బాగా ఆక్సీకరణం చెందుతాయి కాబట్టి, అవి మనం ఇంకా వెలికితీయని అనేక ప్రభావాలను కలిగి ఉంటాయి," అన్నారాయన. అధ్యయనం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, ROOOH వాతావరణ జీవితకాలాన్ని నిమిషాల నుండి గంటల దాకా అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: