పరిపాలనలో ఐఏఎస్ అధికారులది ఎంత కీలకపాత్రో మనకు తెలియంది కాదు. చట్టాన్ని కాపాడాల్సిన ఆ అధికారులే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే.. మాత్రం వారిని శిక్షించండం అంత వీజీ కాదు. కనీసం వారిని విచారించాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే.

కానీ ఇప్పుడు సీన్ మారింది. అవినీతికి పాల్పడే సివిల్స్ సర్వీసెస్ అధికారులపై సామాన్యులు సైతం ఫిర్యాదు చేయవచ్చు. వారి అవినీతిపై విచారణ కోరవచ్చు. ఇందుకు వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.


ఈ కేంద్ర నిర్ణయం వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్‌పై సుబ్రమణ్య స్వామి వేసిన ఓ కేసులో ప్రభుత్వ ఉద్యోగిని విచారించడానికి అనుమతివ్వాలంటూ  సాధారణ పౌరులను నిరోధించే నిబంధనలేవీ చట్టంలో లేవని సుప్రీంకోర్టు అప్పట్లో స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్రం ముసాయిదా సిద్ధం చేసింది. దీని ప్రకారం ఎవరైనా సివిల్స్ సర్వీస్ అధికారిపై విచారణ కోరితే.. ఆ ప్రతిపాదనను మొదట రాష్ట్రప్రభుత్వానికి పంపుతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపి విచారణార్హమేనని తేలితే  కేంద్రానికి నివేదిక పంపుతుంది. పౌరుడి ఫిర్యాదు నిజమని తేలితే నిబంధనల ప్రకారం కేంద్రం ముందుకెళ్లాల్సి ఉంటుంది. 3 నెలల్లో ఆ అవినీతి అధికారిపై చర్యలు చేపట్టాల్సి ఉటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: