దేశవ్యాప్తంగా రుణమేళాను ప్రారంభించబోతున్నట్టు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పన్ను చెల్లింపును పదిశాతం మేరకు తగ్గించిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర  మోదీకి దక్కిందని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని హైదర్ గూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో  ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కార్యాలయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,  ఎమ్మెల్సీ రాంచంధర్ రావ్ లతో కలసి కేంధ్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..133కోట్లమంది కాకుండు ప్రపంచం అంతా మోదీ పాలన వైపు చూస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ ప్రజలు  అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మెట్రో,  ఎంఎంటీఎస్. రైళ్ల విషయంలో కాకుండా చివరకి ఇల్లనిర్మాణంలోను,  తాగునీరును ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు అందుబాటులో కార్యాలయం ఉంటుందన్నారు. తెలంగాణాలో టిఆర్ ఎస్ కు మురికి వాడల వారే కాకుండా  కాలనీలు.. అపార్ట్ మెంట్ వాసులు మద్దతిచ్చారని చెప్పారు. కానీ చిన్న వర్షం పడితే చాలు ఇళ్ళు మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనితో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వాపోయారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని విమర్శించారు. ముఖ్యంగా రెండు లక్షల ఇల్లు మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు.  ఇళ్ల  నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ వల్ల పేదల కల సాకారం కావడం లేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..ఈ కార్యలయం సేవలు ఆందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ  ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యాలయం అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ కార్యాలయం ఆదర్శంగా  ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఆదర్శవంతమైన కార్యాలయంగా రూపుదిద్దుకోవాలన్నా ఆశాభావాన్ని లక్ష్మణ్ వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: