
కానీ ఈ ఫైనల్ మ్యాచ్ ఆలస్యం అయిన నేపథ్యంలో ప్రేక్షకులలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారు అనే విషయంపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ఇక ఎంతోమంది మాజీ ప్లేయర్స్ సైతం ఇక ఇదే విషయంపై స్పందిస్తూ తమ అభిమాన జట్టుకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గుజరాత్ మొదటి ప్రయత్నంలోనే టైటిల్ విజయం సాధించి డిపెండింగ్ ఛాంపియన్ గా ఉంటే.. అటు చెన్నై నాలుగు సార్లు టైటిల్ విజేతగా కొనసాగుతుంది. ఇక ఇరుజట్లు కూడా ఐపీఎల్లో పటిష్టమైన టీమ్స్ గానే కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి.
ఇకపోతే ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న గిల్ బ్యాటింగ్ పై సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు గిల్ ప్రదర్శన మరుపు రానిదని.. అతను చేసిన సెంచరీలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు సచిన్ టెండూల్కర్. ఇక గుజరాత్ బలాలైనా శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ల వికెట్లు చెన్నైకి కీలకంగా మారనున్నాయి. అదే సమయంలో చెన్నై జట్టుకి కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. దీంతో ఫైనల్ పోరు రసవత్తరంగా మారబోతుంది అంటూ సచిన్ చెప్పుకొచ్చాడు.