దాదాపు గత 56 రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ ముగియాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా ఇక మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా సమయం వరకు ఇక మ్యాచ్ నిర్వహించాలని ఇక అంపైర్లు ప్రయత్నించారు.


 కానీ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఇక మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని మాత్రం ఎక్కడా ఇవ్వలేదు. దీంతో ఇక ఫైనల్ మ్యాచ్ కోసం కేటాయించిన రిజర్వుడే రోజు మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో నేడు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ కాస్త ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్ పై మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఐపీఎల్ ఫైనల్ లో విజేతగా నిలిచిన టీంకి 20 కోట్ల ప్రైస్ మనీ దక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ప్రైజ్ మనీ తో పాటు ట్రోఫీ కూడా దక్కుతుంది.


 ఇక మరోవైపు రన్నరప్ గా నిలిచిన టీం కి 13 కోట్ల ప్రైస్ మనీ ఇస్తారు. ఇదిలా ఉంటే అటు ప్రతి సీజన్లో గెలిచిన టీం కి అందించే ఐపీఎల్ ట్రోఫీ పై సంస్కృతంలో కొన్ని వ్యాఖ్యలు రాసి ఉంటాయి. అయితే దీని అర్థం ఏంటి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ట్రోఫీపై యత్ర ప్రతిభ.. అవసర ప్రాప్రోతిహా అని రాసి ఉంటుందట. అంటే ఎక్కడ ప్రతిభ ఉంటుందో వారికి అవకాశం లభిస్తుంది ఈ సంస్కృతం వ్యాఖ్యల అర్థం వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl