మొన్నటి వరకు ఐపీఎల్ లో వరుస మ్యాచ్లతో  బిజీబిజీగా గడిపిన టీమిండియ ఆటగాళ్లు ఇక ఇప్పుడు ఏకంగా భారత జట్టును విశ్వవిజేయతంగా నిలపడం కోసం కష్టపడేందుకు సిద్ధమయ్యారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది టీమ్ ఇండియా జట్టు.  ఈ ఫైనల్ మ్యాచ్ కోసం సెలెక్ట్ అయిన భారత ఆటగాళ్లందరూ ఇప్పటికే ఇంగ్లాండు చేరుకున్నారు. అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు అని చెప్పాలి. ఇంగ్లాండులోని ఓవల్ వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలబడబోతుంది టీమిండియా. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్ గురించి అటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇక ఈసారి సంప్రదాయమైన క్రికెట్లో ఈ ఫైనల్లో విజయం సాధించి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై చర్చ జరుపుతూ ఉండడం గమనార్హం. ఇక జట్టు కూర్పు విషయంలో ఎలా వ్యవహరించాలి.. ఇరు జట్ల  బలాబలాలు ఎలా ఉన్నాయి అనే విషయంపై ఎంతోమంది సోషల్ మీడియాలో రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జూన్ 7వ తేదీ నుంచి అటు భారత్తో డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతున్న నేపథ్యంలో.. ఇక ఆస్ట్రేలియా బౌలర్లకు ఆ జట్టు మాజీ సారథి కీలక సూచనలు చేశాడు అని చెప్పాలి. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, పూజార, గిల్ పై ఆస్ట్రేలియా బౌలర్లు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అంటూ రికీ పాంటింగ్ సూచించాడు.ఐపీఎల్ లో కోహ్లీ, గిల్ బికరమైన ఫామ్ ని చూసాం. ఇక టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ పూజారను అడ్డుకోవడం అంత సులభమైన విషయం కాదు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్ లాగానే ఉంటుంది. అక్కడ కోహ్లీ పూజార చెలరేగే ఛాన్స్ ఉంది. వారిని అడ్డుకోకపోతే ఆస్ట్రేలియాకు విజయం కష్టమే అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc