2023 ఐపీఎల్ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాడు అన్న విషయం తెలిసిందే  ఇక ముంబై ఇండియన్స్ తరఫున మంచి ఫామ్ కనబరుస్తూ ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేశాడు. ముఖ్యంగా అటు వాంకండే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అయితే సూపర్ సెంచరీ తో అదర కొట్టాడు. 49 బంతుల్లోనే 103 పరుగులు చేసి అజయంగా నిలిచాడు అని చెప్పాలి. ఏకంగా 360 డిగ్రీ ప్లేయింగ్ మరోసారి తన వీడియో గేమ్ బ్యాటింగ్ ను చూపించాడు సూర్య కుమార్ యాదవ్. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో తన తొలి సెంచరీని నమోదు చేశాడు అని చెప్పాలి.


 అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు 6 సిక్సర్లు ఉండడం గమనార్హం. దీన్నిబట్టి ఇక అతను బౌలర్లపై  ఎంతలా వీరవిహారం చేశాడో ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ ముగిసినప్పటికీ ఐపీఎల్లో బాగా రాణించిన ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్న వారి సంఖ్య మాత్రం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వాంకడే స్టేడియంలో మాస్టర్ క్లాస్ టీ20 సెంచరీ తనకు కనుల విందు చేసింది అంటూ పేర్కొన్నాడు సంజయ్ మంజ్రేకర్. సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ చూసిన సమయంలో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక క్రీడా ఛానల్ తో మాట్లాడుతూ వాంకాడే మైదానంలో నా కళ్ళ ముందు సూర్యకుమార్ బాదిన ఆ సెంచరీ ఎంతో అద్భుతం. టీ20 మాస్టర్ క్లాస్ చూశాను. టీ20 భవిష్యత్తు ఆశా కిరణం కనిపించింది. ఆరోజు సూర్యకుమార్ ఇన్నింగ్స్ అమోగం. అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనే సందేహంలో ఉండిపోయాయ్. ఆశ్చర్యం లో అలాగే చూస్తూ ఉండిపోయా అంటూ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో అటు సూర్య సెంచరీ సాధించినప్పటికీ గుజరాత్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మాత్రం సూర్యనే వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl