
తప్పకుండా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు వరల్డ్ కప్ గెలుస్తుంది అని నమ్మకంతో ఉన్న సమయంలో ఊహించిన రీతిలో వరుస పరాజయాలు ఎదురై ఇక లీగ్ దశ నుంచే జట్టు నిష్క్రమించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆటగాళ్లు తీవ్ర నిరాశకు లోనవడం జరుగుతూ ఉంటుంది. అయితే తన విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటూ చెబుతున్నాడు టీమిండియా మాజీ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 2007 వరల్డ్ కప్ మంచి నిష్క్రమించిన సమయంలో తాను కనీసం రూమ్ నుంచి కూడా బయటకు రాలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్.. ఈ వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వెస్టిండీస్ వేదికగా 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో ఎంతగానో బాధపడ్డాను అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. అనూహ్యంగా గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో టీమ్ ఇండియాకు స్వదేశం వెళ్లడానికి కనీసం టికెట్లు కూడా లభించలేదు. దీంతో ట్రినిడాట్ లోని ఒక హోటల్ రూమ్ లో ఉండిపోయాం. అయితే తన గదిలోకి కనీసం హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా పిలవలేదు. రెండు రోజులపాటు రూమ్ లోనే ఉండిపోయాను. ఎవరికి కనీసం ముఖం చూపించలేకపోయా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.