బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపును సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే ప్రస్తుతం రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది ఐపీఎల్. అంతేకాదు ప్రపంచ క్రికెట్కు ఫ్యూచర్ స్టార్స్ ని అందించే ఒక గొప్ప టోర్నీగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు. కానీ అద్భుతం జరిగాక గుర్తించాల్సిన అవసరం కూడా లేదు అనే ఒక డైలాగ్ అటు ఐపీఎల్ విషయంలో సరిగ్గా సరిపోతుంది.


 ఎందుకంటే ఒక సాదాసీదా టీ20 టోర్నీ లాగా ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపుకు చూసేలా చేస్తుంది అని చెప్పాలి. ఎంతో మంది ఆటకాళ్లు కూడా ఇప్పుడు ఐపీఎల్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు.  ఇక ఇటీవల కాలంలో కొంతమంది ప్లేయర్స్ అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఆడటం కంటే అటు ఐపీఎల్ లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇక ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అనడంలో సందేహం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఐపీఎల్ వల్లే అటు అంతర్జాతీయ క్రికెట్లో టి20 ఫార్మాట్ కి ఆ రేంజ్ లో క్రేజ్ వచ్చింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్ ఎన్నో మార్పులను తెచ్చింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంలో మాదిరిగా ఆటగాళ్ల సమయం పై అంతర్జాతీయ క్రికెట్కు గుత్తాధిపత్యం లేదు. ఐపీఎల్ దీన్ని పూర్తిగా మార్చేసింది. ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టుకు ప్రాధాన్యత ఇచ్చేలా ఆటగాలను ఒప్పించడం ఎంతో సవాలుగా మారింది. ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నా సహచరులు అందరూ కూడా జాతీయ జట్టుకు ఆడటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని కోరుకుంటున్నా అంటూ ఫ్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: