ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య నేటి నుంచి మహాసంగ్రామం ప్రారంభం కాబోతుంది. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా బరిలోకి దిగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇక ఈ ఫైనల్ పోరు జరగబోతుంది. ఈ మహాసంగ్రామానికి అటు ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక సాంప్రదాయమైన టెస్ట్ ఫార్మాట్లో ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ గురించి చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే తుదిజట్టు కూర్పు ఎలా ఉండాలి ఇక ఎవరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగాలి అనే విషయంపై ఇక తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై అటు సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్  డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లలో ఏది మీ ఫేవరెట్ అంటూ అడిగిన ప్రశ్నకు.. ఏ టీం ఫేవరెట్ అని చెప్పడం చాలా కష్టం.  ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, టీమిండియాలు ఎక్కువగా టెస్టులు ఆడలేదు. కానీ టీమిండియా చివరగా ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్ ను సొంత గడ్డపై ఓడించింది. అది ఆ జట్టుకు కలిసి వచ్చే అంశమే.


 ఓవల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించిన చివరి దశలో భారత స్పిన్నర్లు ప్రభావం  చూపే అవకాశం ఉంది . ఇక విరాట్ కోహ్లీ ఎక్కడ ఆడిన తానేంటో నిరూపించుకోవాలనుకుంటాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై అతడు నిలకడగా రాణించడం చూసాం. ఇక ఫామ్ లోకి వచ్చి ఆటను ఆస్వాదించడం చూస్తూ ఉన్నాం. కోహ్లీ ఇంగ్లాండ్ లో మళ్లీ బాగా ఆడాలని కోరుకుంటున్నా. బౌలింగ్లో  బుమ్రా లేకపోవడం పెద్ద లోటే. కానీ అతని లోటును సిరాజ్ భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు భారత బౌలింగ్ అటాక్లో ప్రధాన అస్త్రం సిరాజ్ అంటూ ఎబి డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc