ప్రపంచ క్రికెట్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం  జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండులోని ఓవల్ మైదానం వేదికగా ఈ పోరు జరుగుతూ ఉండడం గమనార్హం. జూన్ 11వ తేదీ వరకు కూడా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా ఫైనల్ లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. అయితే ఓవల్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా రానించి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు అందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.



 2021 డబ్ల్యూటీసీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి నిరాశపరిచిన టీమ్ ఇండియా.. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు చేయకుండా తప్పకుండా టైటిల్ విజేతగా నిలుస్తుందని అనుకున్నారు అందరూ. కానీ ఊహించని రీతిలో గతంలోని వైఫల్యాన్ని ఇప్పుడు కొనసాగిస్తుంది టీం ఇండియా. ఎందుకంటే ఎక్కడైతే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించి జట్టుకు భారీ స్కోరును అందించారో.. ఇక అదే పిచ్ పై అటు టీమిండియా బ్యాట్స్మెన్లు మాత్రం పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు.


 దీంతో తమ ముందు కొండంత లక్ష్యం ఉంది అన్న విషయాన్ని మరిచిపోయి.. చివరికి తక్కువ పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోతున్నారు అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. తొలి ఇన్నింగ్స్ లో 151 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రిజ్ లో రహానే 29, భారత్ 5 ఉన్నారు. అయితే అంతకుముందు రోహిత్ 15, గిల్ 13, పూజార 14, కోహ్లీ 14, జడేజా 48 తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఇంకా భారత్ 318 పరుగులు వెనుకబడి ఉంది. మరో 118 పరుగులు చేస్తే ఫాలో ఆన్ గండం నుంచి బయటపడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: