మానవుని జీవితంలో ఆధ్యాత్మిక మార్గము అనేది ఒక పాఠశాలవంటిది. ఇది సాధారణ కళలు నేర్చుకునే పాఠశాల కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక పాఠశాల. ఇక్కడ ఆత్మిక నైపుణ్యాలను పెంచుకోవడం ఎలా, వ్యక్తిత్వంపై పడ్డ మచ్చలను తుడిచి వెయ్యడం ఎలా, నీ చుట్టూ ఉన్న చెడు ప్రభావాలకు దూరంగా ఉండటం ఎలా లాంటివి నేర్చుకుంటావు. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే వ్యక్తిగత గుణాల వికాసము జరుగదేమో అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. అసలు ఈ రోజు మానవుడికి ఎటువంటి కళలు అవసరము? తనలోని అహంకారాన్ని తీసెయ్యడము ఒక పెద్ద కళ.

ఇతరులను ప్రేమించ డము మరొక కళ. జటిలమైన ఇతర విషయాలను చదవాల్సిన అవసరం లేదు. భగవంతుని అనుసరించే గుణం నీలో ఉంటే, భగవంతుని గుణం నీదవుతుంది. సత్యంగా ఉండు, ఆధ్యాత్మిక అధ్యయనంతో నీ సత్య స్వరూపాన్ని తెలుసుకో, ఆధ్యాత్మిక పట్టాను పొందు! ఒకవేళ మీరు ఏదైనా కార్యానికి బాధ్యత వహించవలసి వస్తే తప్పక బాధ్యతను తీసుకోండి. కానీ మీక సంబంధంలేని విషయము ఉంటే, ఆ కార్యానికి మరొకరు బాధ్యులు అయితే, మీరు అందులో ఇరుక్కోవద్దు. మీకు సంబంధం లేకపోయినా మీరు సహాయం చేయదలిస్తే విశ్వాసము అను సూత్రముతో, సూక్ష్మరీతిలో చేయండి. ఇతరులపై విశ్వాసము ఎంతో పని చేస్తుంది. దీని అర్థము గుడ్డి నమ్మకంతో, నిస్సహాయంగా ఏమీ చెప్పలేని స్థితిలో ఉండమని కాదు.

జరుగుతున్న సంగతులను జాగరూకతతో గమనించి, మీలోని విశ్వాసంతో ఎదుటివారిలో శక్తిని నింపి, చెయ్యలేము అని అనుకునేవారిలో కూడా చెయ్యగలము అన్న ఆత్మ విశ్వాసమును నింపడము. విశ్వాసము ఉంచడము అంటే అర్థము ఇదే. విశ్వాసము అనే శక్తిని దానం చెయ్యండి. ఎదుటి వ్యక్తి నిజాయతీపరుడు, సత్యమైనవాడు అయితే మీ విశ్వాసము పని చేస్తుంది. ఈ విధంగా, ఇతరులకు సత్యంగా సహాయమును అందించడము మనం నేర్చుకోవచ్చు. ఆధ్యాత్మిక మార్గములో ఎన్నో విషయాలను మనము నేర్చుకోవచ్చు. కాబట్టి ఆధ్యాత్మికతను ఎల్లప్పుడూ ఎంజాయ్ చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: