2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ను తెలంగాణ విద్యా శాఖ తాజాగా ఖరారు చేసింది. జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపింది. ఏప్రిల్ 24 చివరి పనిదినంగా తెలంగాణ విద్యా శాఖ  ప్రకటిచింది. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 తేదీ వరకూ వేసవి సెలవులు ఉంటాయి. 2023-24 ఏడాదిలో మొత్తం  229 పనిదినాలు ఉంటాయి. జనవరి 10 తేదీ లోపు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది.


మార్చ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ  తెలిపింది. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతు ఉంటాయి. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉంటాయి. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్‌ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్‌ సెలువులు ఉంటాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: