బాధ కలిగించే పింపుల్స్ వల్ల ముఖం అందంగా కనిపించకపోవడంతో పాటు వాటి వల్ల విపరీతమైన నొప్పి, బాధ కూడా కలుగుతుంది. ఇలా మొటిమలతో బాధపడే వారు మార్కెట్లో లభించే క్రీములను, ఫేస్ వాస్ లను వాడడానికి బదులుగా నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. మొటిమలను తగ్గించడంలో నిమ్మరసం చాలా బాగా పని చేస్తుంది.మనం నిమ్మరసాన్ని ఉపయోగించి చిన్న చిన్న చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇక మొటిమల సమస్యతో బాధపడే వారు నిమ్మరసాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల సమస్యతో బాధపడే వారు నిమ్మరసాన్ని మొటిమలపై నేరుగా రాయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అయితే దీని కోసం ముందుగా ముఖాన్ని సబ్బుతో బాగా శుభ్రంగా కడుక్కోవాలి.ఆ తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకుని కాటన్ బాల్ సహాయంతో మీ ముఖానికి రాసుకోవాలి.


దీనిని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.ఇలా మీరు రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే నిమ్మరసాన్ని రాసుకోవడం వల్ల కొందరి చర్మంపై మంట ఇంకా చికాకు కలుగుతుంది. అందుకే ఇలాంటి వారు వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంకా అలాగే నిమ్మరసాన్ని రాసుకుని ఎండలో తిరగవద్దు. అదే విధంగా నిమ్మరసంలో, రోజ్ వాటర్ ను కలిపి మొటిమలపై రాయడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ముందుగా ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి.ఆ తరువాత ఒక గిన్నెలో నిమ్మరసాన్ని ఇంకా రోజ్ వాటర్ ను తీసుకుని కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో మొటిమలపై రాసుకోవాలి. దీనిని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: