చాలా మంది కూడా జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక జుట్టు పెరుగుదలకు చేసే ప్రయత్నాల్లో మందార ఆకులను ఉపయోగించడం కూడా ఒకటి. చాలా కాలంగా జుట్టు పెరుగుదలకు మనందార ఆకులను, పువ్వులను ఉపయోగిస్తూ ఉన్నాము. మందార ఆకులను ఇంకా పువ్వులను పేస్ట్ గా చేసి జుట్టు పట్టిస్తూ ఉంటారు. ఇంకా అలాగే నూనెలో మందార ఆకులు వేసి ఆ నూనెను జుట్టు రాస్తూ ఉంటారు. ఇలా చాలా రకాల హెయిర్ ప్యాక్ లల్లో కూడా మందార ఆకులను ఉపయోగిస్తూ ఉంటాము.అయితే మనలో చాలా మందికి కూడా మందార ఆకులు నిజంగానే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయన్నా అన్న సందేహం కలుగుతుంది.ఇక మందార ఆకులు మన జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు పెరుగుదల చాలా చక్కగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులను వాడడం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. ఈ మందార ఆకుల్లో ఉండే ఐసోప్లేవనాయిడ్స్ జుట్టు కుదుళ్లకు రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేస్తాయి.


రక్తం ఎక్కువగా సరఫరా అవ్వడం వల్ల పోషకాలు, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు చాలా ఎక్కువగా అందుతాయి.ఇంకా అలాగే జుట్టు కుదుళ్లల్లో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. అందువల్ల జుట్టు కుదుళ్లు బలంగా, ధృడంగా తయారవుతాయి.ఇంకా అలాగే జుట్టు కణాల కవచాలను గట్టి పరచడంలో మందార మనకు దోహదపడుతుంది. కణ కవచాలు గట్టిగా ఉండడం వల్ల జుట్టు కణాలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఇంకా ధృడంగా ఉంటాయి.ఇంకా అదే విధంగా జుట్టును నల్లగా ఉంచడంలో కూడా మందార మనకు సహాయపడుతుంది. మన జుట్టు కుదళ్లల్లో మెలనోసైటిస్ ఉంటాయి.ఇక ఇవి మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి.ఈ మెలనిన్ అనేది ఎంత ఎక్కువగా ఉత్పత్తి అయితే జుట్టు అంత నల్లగా ఉంటుంది. మందార ఆకులను వాడడం వల్ల మెలనిన్ అనేది ఎక్కువగా తయారవుతుంది. అందువల్ల జుట్టు నల్లగా ఉంటుంది. ఇక జుట్టు కుదుళ్లు, తల చర్మం పొడిబారకుండా చేయడంలో కూడా మందార మనకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మందార ఆకులో ఉండే ఫైటో కెమికల్స్ జుట్టు కుదుళ్లు పొడిబారకుండా కాపాడడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: