రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈనెల 4న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్ పై చర్చించనున్నారు. ఓటాన్ అకౌంట్ అకౌంట్ కు, గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలపడంతో పాటు.. రెండు కొత్త పథకాలపై మంత్రివర్గం చర్చించనుంది. అయిదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.


ఆ రెండు పథకాలతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా కేబినెట్‌ మీటింగ్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సిద్ధం చేసింది. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈనెల 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: