ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పుదీనా చికెన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని రుచిని మాటల్లో వర్ణించలేం. ఘుమ ఘుమ లాడిపోతుంది. చికెన్ అన్ని ఐటమ్స్ లలో ఈ పుదీనా చికెన్ చాలా స్పెషల్. ఒక్కసారి తింటే ఈ జన్మలో మరచిపోలేరు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక ఈ రుచికరమైన పుదీనా చికెన్ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....

కావాల్సిన పదార్థాలు:
చికెన్: అరకిలో
పుదీనా: 2 కప్పులు
కొత్తిమీర: కప్పు
అల్లం ముక్క: కొద్దిగా
వెల్లుల్లి: 5 రెబ్బలు
పచ్చిమిర్చి: 5
పెరుగు: అరకప్పు
గరం మసాలా: టీ స్పూను
పసుపు: అర స్పూను
ఉప్పు: రుచికి తగినంత

నూనె: అర కప్పు

నిమ్మకాయలు-1
జీడిపప్పు: అవసరమైనన్నీ.

తయారీ విధానం:
ముందుగా  పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరంమసాలా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.ఒక బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత... జీడిపప్పులు వేసి వేయించాలి. కాసేపాగి చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ అన్నివైపులా చక్కగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చెయ్యండి. చివరలో నిమ్మరసం, కొత్తిమీర వేసి కాసేపు అలాగే ఉంచాలి.ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చెయ్యండి...ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: