ఇస్లామిక్ రాజ్యాలు కాని రాజ్యాలను ఇస్లామిక్ రాజ్యాలుగా మార్చడం కోసం కావాల్సిన పరిస్థితులను వాళ్ళు సృష్టిస్తుంటారు. అల్లకల్లోలం చేసి  ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని భయపెట్టి మరీ వాళ్లని ఇస్లామిక్ మతంలోకి మారుస్తారు వాళ్ళు. యువకులకు ఉన్నాద చర్యను కూడా ఒక స్వాతంత్ర పోరాట యుద్ధంలా చెప్తారు వాళ్ళు. వాళ్లని వాళ్లు మొజాహిద్దీన్లుగా అంటే, యోధుల్లా భావించాలని అంటూ ఉంటారు.


వాళ్లే ప్రపంచంలోని అతి దారుణమైన తీవ్రవాదసంస్థ అల్ఖైదా కు సంబంధించిన ఉగ్రవాదులు. అయితే ఈ అల్ఖైదాకు సంబంధించిన నాయకుడు బిన్ లాడెన్ గతంలోనే హతం అయ్యాడన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన అల్ జవహరి కూడా హతం అయ్యాడు. అతని కొడుకు కూడా హతం అయ్యాడు. మరి ఇప్పుడు ఆల్కైదాకు లీడర్ ఎవరు అని అందరూ దానిపై దృష్టి పెట్టిన వేళ ఒక షాకింగ్ విషయం చెప్పారు వాళ్లు.


అదే ఈ ఉగ్రవాద సంస్థ నాయకుడుగా ఒక భారతీయుణ్ణి నియమించడం. అంటే దీని ద్వారా ఆల్కైదా చెప్పబోయేది ఏంటంటే తమ మత రాజ్య స్థాపనలో ఇదొక భాగమని, మరొక విషయం ఏమిటంటే భారతీయులను కూడా ఆల్కైదాలో  భాగస్వామ్యంలో చేస్తున్నామని ప్రపంచానికి చెప్పడం. ఇప్పటివరకు పాకిస్తాన్ ఇంకా ఆఫ్గనిస్తాన్ ఈ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవి.


ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టినిల్లుగా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ మెట్టినిల్లుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ నుండి ఒక వ్యక్తిని అల్ఖైదాకి చీఫ్ ని చేసి చూపించడం  అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసి సంచలనాన్ని కలిగిస్తుంది. అయితే దీనిపై ఒక అఫీషియల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది ఆల్కైదా. తమ ఆల్కైదా సంస్థకి చీఫ్ గా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ గ్రామానికి చెందిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంది ఇప్పుడు. ఉమర్ అనే ఆ వ్యక్తిని ఇలా నియమించిన కారణం ఏమిటంటే ఉగ్రవాద కార్యకలాపాలను జరపడంలో భారతదేశాన్ని కూడా ఇరికించడానికి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: