ఒక బలవంతుడిని ఎవరినైనా దెబ్బతీయాలంటే అతని మీద లేనిపోని అపవాదులను క్రియేట్ చేసి తద్వారా ఆ మనిషిని కృంగదీయాలి. ఒక అబద్ధాన్ని వందసార్లు అదే నిజం నిజం అని అందరితోనూ చెప్పిస్తే అది అబద్ధమైనా జనాల దృష్టిలో నిజం అయిపోతుంది.‌ ఇప్పుడు ఇలాంటి వాటిని క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది అవతల వాళ్ళకి.


ఎలా అంటే మీడియా ద్వారా, ఇంకా మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒక నిజాన్ని చాలా ఈజీగా ఇప్పుడు సమాధి చేసేయవచ్చు అని వాపోతున్నారు కొంతమంది జనం. ఇప్పుడు ఆదానీ విషయంలో, ఇంకా ఎల్ఐసి కంపెనీ విషయంలో ఇలానే చేస్తున్నారు అని అంటున్నారు. ఆదానీని ఒక దొంగలా చూపించాలి. ఎల్ఐసి మునిగిపోతుందన్నట్లుగా చూపించాలి.


ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఇదంతా ఎందుకు అంటే ఆదానీ లాంటి భారతీయ పారిశ్రామిక వేత్తలు ఎదగకూడదనే అమెరికా  స్కెచ్  వల్ల అని తెలుస్తుంది.  అంతేకాకుండా భారతీయ ఆర్థిక పరిశ్రమ ఎదగకుండా ఎల్ఐసి లాంటి కంపెనీలను పక్కనపెట్టి ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను నడపడం ద్వారా సొమ్ము చేసుకుందామని కొంతమంది ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఆలోచనాపరుల్లో  వామపక్ష భావం ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.


ఎల్ఐసి ఉద్యోగుల్ని రెచ్చగొట్టి ఎల్ఐసి ని దెబ్బతీసే విధానంలో వాళ్లంతా ఉన్నారని తెలుస్తుంది. ఎల్ఐసి డబ్బులు అన్నీ తీసుకెళ్లి ఆదానీకి ఇచ్చేశారు, ఇక ఎల్ఐసి పని అయిపోయింది అని వాళ్లంతా ఒకటే దుష్ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.  వీళ్ళ దుష్ప్రచారం కారణంగా ఎల్ఐసి షేర్ వాల్యూస్ కూడా పడిపోయాయట. కానీ అసలు నిజం వచ్చేసరికి ఎల్ఐసి మొదటి క్వార్టర్ కి 13,191 కోట్ల రూపాయలకు  దాని వ్యాపార లాభాలు చేరుకున్నాయని తెలుస్తుంది. ఒక్కో షేర్ మీద మూడు రూపాయల డివిడెంట్ ప్రకటించిందట ఎల్ఐసి. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగవ త్రైమాసికానికి 13,191కోట్ల నికర లాభాన్ని సంపాదించింది ఎల్ఐసి. కానీ దుష్ప్రచారం కారణంగా రావలసిన లాభాన్ని అందుకోలేక పోయిందట ఎల్ఐసి.

మరింత సమాచారం తెలుసుకోండి: